CM Jagan Review: ఏపీలో అక్టోబర్‌ 2న మరో నవశకం..అధికారులకు సీఎం జగన్ దిశానిర్దేశం..!

CM Jagan Review: వివిధ శాఖలపై సీఎం వైఎస్ జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. శాఖల వారిగా అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఈసందర్భంగా అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు.

Written by - Alla Swamy | Last Updated : Jun 10, 2022, 06:42 PM IST
  • వివిధ శాఖలపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
  • అధికారులకు దిశానిర్దేశం
  • ప్రజలకు మరింత చేరువ కావాలని ఆదేశం
CM Jagan Review: ఏపీలో అక్టోబర్‌ 2న మరో నవశకం..అధికారులకు సీఎం జగన్ దిశానిర్దేశం..!

CM Jagan Review: ఓటీఎస్‌ పథకం కింద లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్లను వేగంగా పూర్తి చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. టీడ్కోకు సంబంధించి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్‌ సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత సిబ్బందికి, ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. కేవలం ఆస్తుల రిజిస్ట్రేషన్‌ గురించి కాకుండే ఇతర సేవలపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. 

అక్టోబర్‌ 2న తొలి విడతగా గ్రామాల్లో శాశ్వత భూ హక్కు-భూరక్ష పత్రాలతోపాటు సంబంధిత సచివాలయాల్లో రిజిస్ట్రేషన్‌ సేవలు అందించడానికి చర్యలు తీసుకోవాలన్నారు సీఎం జగన్. ఇప్పటికే 650 గ్రామాల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయని..ఆ సంఖ్యను మరింత పెంచాలని తెలిపారు. 14 వేల గ్రామ, వార్డు సెక్రటరీలకు రిజిస్ట్రేషన్‌పై శిక్షణ ఇస్తున్నామన్నారు. అక్టోబర్‌ 2న మరో చరిత్ర మొదలు కానుందన్నారు సీఎం.

వెదురు పెంపకాన్ని ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని అటవీ శాఖ అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఏపీఎండీసీ నిర్వహిస్తున్న సులియారీ బొగ్గు గనుల నుంచి ఉత్పత్తి ప్రారంభమైందని ఈసందర్భంగా సీఎం దృష్టికి అధికారులు తీసుకెళ్లారు. జెన్‌కోతోపాటు ఇతర పరిశ్రమలకు ఇక్కడి నుంచే బొగ్గు సరఫరా అయ్యేలా చూడాలన్నారు. తదుపరి బొగ్గు గనుల వేలం ప్రక్రియలో పాల్గొనే దానిపై దృష్టి పెట్టాలని దిశానిర్దేశం చేశారు. 

వాణిజ్య పన్నుల శాఖ పునర్‌ నిర్మాణం చేయాలని సమీక్షలో నిర్ణయించారు. శాఖలో ప్రతి ఒక్కరి పాత్ర, బాధ్యతలపై స్పష్టత ఇచ్చారు. డాటా అనలిటిక్స్ విభాగం, లీగల్‌ సెల్‌ ఏర్పాటు కానుంది. బకాయిల వసూలకు ఓటీఎస్ సదుపాయం అందుబాటులోకి రానుంది. వాణిజ్య పన్నుల శాఖ అధికారుల ప్రతిపాదనలకు సీఎం జగన్ ఆమోదం తెలిపారు. అక్రమ మద్యం తయారీ, అక్రమ మద్యం రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భేటీలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, మంత్రులు ధర్మాన ప్రసాదరావు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ సమీర్‌ శర్మతోపాటు ఇతర అధికారులు పాల్గొననున్నారు.

 

Also read:TS Governor Tamilsai: నాకో లెక్కుంది..నన్ను ఎవరూ ఆపలేరన్న గవర్నర్ తమిళిసై..!

Also read:Kannada Actor Ramya: కన్నడ నటి రమ్యకు వేధింపులు..పోలీసులకు ఫిర్యాదు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News