పవిత్ర తుంగభద్ర నదీ పుష్కరాలు రేపు ప్రారంభం కానున్నాయి. 12 రోజుల పాటు జరిగే పుష్కరాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే ఈ పుష్కరాలు..నదీ స్నానాల్లేకుండానే జరగనుండటం విశేషం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


గురుడు ఒక్కొక్క రాశిలో ప్రవేశించినప్పుడు ఒక్కొక్క నదికి పుష్కరాలు ( Pushkaralu ) వస్తుంటాయి . ఈ క్రమంలో తుంగభద్ర నదీ పుష్కరాలు ( Tungabhadra river pushkarams ) రేపట్నించి అంటే నవంబర్ 20 నుంచి ప్రారంభమై..12 రోజుల పాటు జరగనున్నాయి. డిసెంబర్ 1న పుష్కరాలు ముగియనున్నాయి. పుష్కరాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ( ap minister vellampalli srinivas ) వెల్లడించారు. కోవిడ్ సంక్రమణ ( Covid spread ) నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల్ని( Central Guidelines ) అనుసరించి స్నానాల్ని నిషేధించామని మంత్రి చెప్పారు. అంటే నదీ స్నానాల్లేకుండా బహుశా చరిత్రలో జరుగుతున్న తొలి పుష్కరాలు ఇవే కావచ్చు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ నదీ స్నానాలకు అనుమతి లేదని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. 


తుంగభద్ర నదీ పుష్కరాల్లో ఉదయం 6 గంటల్నించి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే భక్తుల్ని ఘాట్ లోకి అనుమతిస్తామన్నారు. రేపు మధ్యాహ్నం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) తుంగభద్ర పుష్కరాల్లో పాల్గొననున్నారు. పుష్కరాల్ని కూడా విపక్షాలు రాజకీయ కోణంలో చూస్తున్నాయని ఆరోపించారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుష్కరాల పేరుతో వందల కోట్లు దుర్వినియోగం చేశారన్నారు. Also read: AP: రాష్ట్రంలో అదనంగా 16 ప్రభుత్వ వైద్య కళాశాలలు