Chandrababu:గోదావరిలో పడిపోయిన టీడీపీ నేతల పడవ.. చంద్రబాబుకు తప్పన ప్రమాదం... నీళ్లలో పడిన దేవినేని ఉమ
Chandrababu: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గోదావరి వరద ప్రాంతాల పర్యటనలో ఊహించని ప్రమాదం జరిగింది. చంద్రబాబు తృటిలో త్పపించుకున్నారు. మరికొందరు టీడీపీ నేతలు గోదావరిలో పడిపోయారు. అయితే స్థానికులు వెంటనే స్పందించి గోదావరిలో పడిపోయిన టీడీపీ నేతలను రక్షించారు.
Chandrababu: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గోదావరి వరద ప్రాంతాల పర్యటనలో ఊహించని ప్రమాదం జరిగింది. చంద్రబాబు తృటిలో త్పపించుకున్నారు. మరికొందరు టీడీపీ నేతలు గోదావరిలో పడిపోయారు. అయితే స్థానికులు వెంటనే స్పందించి గోదావరిలో పడిపోయిన టీడీపీ నేతలను రక్షించారు. ఈ ప్రమాదంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రమాదం తప్పడం.. నీళ్లలో పడిపోయిన టీడీపీ నేతలు సేఫ్ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
గోదావరి ముంపు గ్రామాలు పరిశీలించేందుకు వెళ్లారు చంద్రబాబు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ముంపు గ్రామాలకు వెళ్లారు. చంద్రబాబుతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన టీడీపీ నేతలు, మాజీ మంత్రి దేవినేని ఉమ ఉన్నారు. అయితే టీడీపీ నేతలు వెళుతున్న పడవల్లో రెండు సోంపల్లి వద్ద ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఓ వైపునకు ఒంగిపోయిన పడవలో ఉన్న టీడీపీ నేతలో గోదావరి నదిలో పడిపోయారు. ప్రమాదానికి గురైన పడవలో ఉన్న మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో పాటు ఉండి ఎమ్మెల్యే రామరాజు, తణుకు మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ, టీడీపీ సీనియర్ నేత సత్యనారాయణ గోదావరి నదిలో పడిపోయారు. అయితే చంద్రబాబు ప్రయాణిస్తున్న పడవకు ఎలాంటి ప్రమాదం జరగలేదు.
రెండు బోటు పడవలు ఢీకొట్టడం.. టీడీపీ నేతలు గోదావరిలో పడిపోవడంతో అక్కడే ఉన్న మత్స్యకారులు వెంటనే స్పందించారు. టీడీపీ నేతలను నదిలో నుంచి సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. మత్స్యకారులు వేగంగా స్పందించడం వల్లే అంతా సురక్షితంగా బయటపడ్డారు.గోదావరిలో పడిపోయిన తెలుగుదేశం పార్టీ నాయకులను మత్స్యకారులు బయటకు తీసుకువస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Also Read: బ్రదర్ ప్యాడ్లు మర్చిపోయావ్.. ప్రత్యర్థి ప్లేయర్స్ చెప్పగానే డగౌట్‌కు పరుగెత్తిన బ్యాటర్!
Also Read: Siddhartha: ఆ హీరోయిన్ తో ప్రేమలో సిద్దూ.. ఫోటోలు తీసిన వారిపై సీరియస్
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook