Gold Theft: గుంటూరు జిల్లా బాపట్లలోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా(Bank of Baroda)లో 5.8 కిలోల బంగారం మాయమవడం కలకలం రేపింది. బ్యాంకులో అటెండర్‌గా పని చేసే సుమంత్ రాజు ఈ మోసానికి పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. దాదాపు రెండేళ్ల నుంచి సుమంత్ బంగారం చోరీ(Gold Theft) చేస్తున్నట్లు తేల్చారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ నెల 2న బ్యాంకులో ఆభరణాల ఆడిటింగ్ జరిగింది. అదే రోజు సుమంత్ సెలవు పెట్టాడు. ఆడిటింగ్‌(Auditing)లో బంగారు ఆభరణాలు మాయం అవడం.. సుమంత్ సెలవు పెట్టి వెళ్లిపోవడంతో అధికారులకు అనుమానం వచ్చింది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు బ్యాంకు సిబ్బంది పోలీసులకు ఆదివారం రాత్రి ఫిర్యాదు చేశారు.


ఈ విషయంపై విచారణ ప్రారంభించిన పోలీసులు(Police) సుమంత్ రాజుకు సహకరించిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. బ్యాంకు అధికారుల(Bank Officials)తో పాటు స్ట్రాంగ్ రూంలోకి తరచూ వెళ్లే సుమంత్ వారి కళ్లు గప్పి ఆభరణాలు తస్కరించేవాడని గుర్తించారు. బ్యాంకు నుంచి చోరీ చేసిన బంగారం విలువ రూ. 2.2 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. 


Also Read: AP Rain Alert: రాగల 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం..వచ్చే మూడు రోజులపాటు భారీ వర్షాలు..


కాగా, చోరీ చేసిన బంగారాన్ని సుమంత్‌ ఓ ప్రవేట్‌ ఫైనాన్స్‌ కంపెనీలో తాకట్టు పెట్టినట్లు సమాచారం. బంగారం మాయమైన విషయం బయటకు తెలియడంతో ఖాతాదారులు బ్యాంకు వద్దకు చేరుకున్నారు. తాము తాకట్టు పెట్టిన ఆభరణాలు పోవడంపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బంగారం(Gold) ఎక్కడ ఉందో గుర్తించామని ఎవరూ ఆందోళన చెందవద్దని అధికారులు వారికి నచ్చజెప్పారు. చోరీపై పూర్తి స్థాయిలో విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook