విశాఖపట్నం నగర (Visakhapatnam) వాసులను విషవాయుల లీకేజీ (gas leak) ఘటనలు వెంటాడుతూనే ఉన్నాయి. సముద్రం సరిహద్దున ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండే ఈ నగరంలో.. విషవాయువుల లీకేజీలతో ఎప్పుడు ఏ ప్రమాదం వచ్చిపడుతుందో ఏమోనని ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఒక్క Tik Tok‌తోనే చైనాకు వంద కోట్ల నష్టం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవల జరిగిన ఎల్జీ పాలిమర్స్ (LG Polymers Gas) ఘటన నుంచి తేరుకోకముందే ఫార్మాసిటీలో అర్థరాత్రి జరిగిన ప్రమాదం మళ్లీ విశాఖవాసులను ఉలిక్కిపడేలా చేసింది. నగరంలోని పరవాడ ఫార్మాసిటీలోని సాయినార్ లైఫ్ సైన్స్ ప్రైవేట్ కంపెనీ (Sainor Life Sciences)లో రియాక్టర్ నుంచి విషవాయువు లీకైంది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడిక్కడే మరణించారు. ఈ కంపెనీలో షిఫ్ట్ ఇన్‌చార్జ్‌గా పనిచేస్తున్న నరేంద్ర, కెమిస్ట్ గౌరీశంకర్ మృతిచెందారు. మరో నలుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వారికి గాజువాకలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.వాహనదారులకు స్వల్ప ఊరట


సంఘటనా స్థలాన్ని కలెక్టర్ వినయ్ చంద్, సీపీ ఆర్కే మీనా సందర్శించి ప్రమాదానికి గల కారణాలను యాజమాన్యాన్ని అడిగి తెలుసుకున్నారు. రియాక్టర్ నుంచి బెంజిన్ మెడిజోన్ గ్యాస్(Benzimidazole gas) లీకవడంతోనే ఈ ప్రమాదం సంభవించిందని చెబుతున్నారు. ఈ మేరకు పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు.  Tik Tok, UC Browser: టిక్‌ టాక్, యూసీ బ్రౌజర్ సహా 59 మొబైల్ యాప్స్‌పై నిషేధం


ఇటీవల విశాఖలో జరిగిన ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో దాదాపు 14 మంది వరకు మరణించిన సంగతి తెలిసిందే. తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
Photos: రానా, మిహీకా బజాజ్ ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ షురూ