AP: పోలవరంపై నీతి ఆయోగ్ సిఫార్సులు సమంజసం కాదు
ఆంధ్రప్రదేశ్ జీవనరేఖ పోలవరం ప్రాజెక్టు విషయంలో మాజీ ఉండవల్లి అరుణఅ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. నీతి ఆయోగ్ చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ జీవనరేఖ పోలవరం ప్రాజెక్టు విషయంలో మాజీ ఉండవల్లి అరుణఅ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. నీతి ఆయోగ్ చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని విమర్శించారు.
ఏపీ ప్రజలకు జీవనాడి వంటి పోలవరం ప్రాజెక్టు ( Polavaram project ) విషయంలో నీతి ఆయోగ్ ( Niti Aayog ) చేసిన వ్యాఖ్యల్ని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ( Undavalli Arun kumar ) తప్పుబట్టారు. ఏ ప్రాజెక్టుకైనా జాతీయ హోదా ఉన్నప్పుడు పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే నిర్మించాల్సి ఉంటుంది. అలా కాకుండా 30 శాతం నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేయడం సమంజసం కాదని..విడ్డూరంగా ఉందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మండిపడ్డారు. విభజన చట్టంలో ఉన్న అంశాల్ని కూడా పట్టించుకోకపోతే ఎలాగని ప్రశ్నించారు.
విభజన చట్టం ( Ap Reorganisation act ) లో ఇరిగేషన్ కాంపోనెంట్ అంటే భూసేకరణ, ఆర్అండ్ఆర్ ఉంటాయని ఉండవల్లి స్పష్టం చేశారు. వీటిని పూర్తి స్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనన్నారు. మొత్తం ప్రాజెక్టు ఖర్చు ఇవ్వాల్సింది పోయి..కేవలం 7 వేల కోట్లే ఇవ్వాలని చెప్పడం అన్యాయమన్నారు. పోలవరం ప్రాజెక్టు పునరావాసానికి 22 కోట్లు ఇవ్వాల్సి ఉందని గుర్తు చేశారు.
ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టు క్రెడిట్ అంతా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ( Ys Rajasekhar reddy ) దేనని ఉండవల్లి స్పష్టం చేశారు. ఆరోజు వైెఎస్ పూనుకోకపోతే పోలవరం జాతీయ ప్రాజెక్టు అయ్యేది కాదన్నారు. రిజర్వాయర్ నిర్మిస్తే పుష్కలంగా నీరు నిల్వచేసే అవకాశముంటుందని వైఎస్ ఆలోచించారన్నారు. గోదావరి నది ( Godavari river )పై తెలంగాణలో నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకాలకు అనుమతులు లేవని...గత చంద్రబాబు ప్రభుత్వం ( Chandrababu Government ) దీనిని ప్రశ్నించలేదని గుర్తు చేశారు. విభజన చట్టంలోని మిగిలిన పార్టీల్ని కలుపుకుని పార్లమెంట్‌లో ఒత్తిడి తీసుకురావాలని చెప్పారు. చివరిగా బీజేపీ పార్టీలో చేరికలపై స్పందించారు. ఆ పార్టీలో చేరాలనుకునేవారు వినయ్ సేతుపతి రచించిన జుగల్బందీ లేదా బంచ్ ఆఫ్ థాట్స్ పుస్తకం చదివి నిర్ణయం తీసుకోవాలని సూచించారు.