New coronavirus strain: అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం, విదేశాల్నించి వచ్చేవారికి విధిగా ఆర్టీపీసీఆర్ పరీక్షలు

New coronavirus strain: బ్రిటన్ లో వెలుగుచూసిన కరోనా కొత్త రకం వైరస్ ప్రపంచాన్ని భయపెడుతోంది. ఇప్పటికే ఇండియాలో ప్రవేశించడంతో..ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది.

Last Updated : Dec 22, 2020, 08:58 PM IST
  • కొత్త కరోనా వైరస్ పై ఏపీ ప్రభుత్వం అప్రమత్తం
  • విదేశాల్నించి వచ్చేవారికి తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ పరీక్షలు
  • పాజిటివ్ అయితే కోవిడ్ సెంటర్ కు...నెగెటివ్ అయితే 14 రోజుల తప్పనిసరి హోమ్ క్వారెంటైన్
New coronavirus strain: అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం, విదేశాల్నించి వచ్చేవారికి విధిగా ఆర్టీపీసీఆర్ పరీక్షలు

New coronavirus strain: బ్రిటన్ లో వెలుగుచూసిన కరోనా కొత్త రకం వైరస్ ప్రపంచాన్ని భయపెడుతోంది. ఇప్పటికే ఇండియాలో ప్రవేశించడంతో..ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది.

కరోనా వైరస్ ( Corona virus ) మార్పులు చెంది కొత్త రకం వీయూఐ 202012/1 ( VUI 202012/1 ) గా ప్రపంచదేశాల్ని ఆందోళనకు గురి చేస్తోంది. బ్రిటన్ ( Britain ) నుంచి ప్రారంభమై ఆస్ట్రేలియా, బెల్జియం, ఇటలీ, నెదర్లాండ్స్ దేశాలతో పాటు ఇండియా ( India )లో కూడా ఈ కొత్త రకం వైరస్ ( New coronavirus strain ) విస్తరిస్తోంది. ఇప్పటికే లండన్ నుంచి వచ్చిన 256 మందికి పరీక్షలు చేయగా..8మందిలో కొత్త కరోనా వైరస్ ఉన్నట్టు ప్రాధమికంగా తేలింది. మరిన్ని పరీక్షల కోసం పూణేకు పంపించారు. అటు యూకేకు భారతదేశం విమానాల్ని నిషేధించడమే కాకుండా అప్రమత్తంగా ఉండాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. 8 కేసుల్లో ఐదు ఢిల్లీ నుంచి, రెండు కోల్ కత్తా నుంచి, ఒకటి చెన్నైె నుంచి ఉన్నట్టు తెలిసింది. 

ఈ నేపధ్యంలో కేంద్ర సూచనల మేరకు ఏపీ ప్రభుత్వం ( Ap Government ) అప్రమత్తమైంది. ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవల్సిందిగా అధికార్లను ఆదేశించింది. విదేశీ ప్రయాణీకులకు ఆర్టీపీసీఆర్ పరీక్ష ( RTPCR Test ) తప్పనిసరి చేసింది. పాజిటివ్ పేషెంట్లను కోవిడ్ ఆస్పత్రికి తరలించాలని సూచించింది. నెగెటివ్  వచ్చిన వారిని 14 రోజులు విధిగా హోం క్వారెంటైన్ చేయాలని..ఎయిర్ పోర్టుల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే ఇప్పటికే విదేశాల్నించి వచ్చినవారి వివరాలు సేకరించే పని ప్రారంభించారు అధికారులు.

Also read: New coronavirus: భారత్‌లో కొత్త రకం కరోనా..అప్పుడే 8 కేసులు

Trending News