AP: పోలవరంపై ఇంప్లీడ్ పిటీషన్ వేసి కేసు వాదిస్తాను: ఉండవల్లి
మరోసారి వివాదాస్పదంగా మారిన పోలవరం ప్రాజెక్టుపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక విషయాలు బయట పెట్టారు. పోలవరం విషయంలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాంప్రమైజ్ అయ్యారని స్పష్టం చేశారు.
మరోసారి వివాదాస్పదంగా మారిన పోలవరం ప్రాజెక్టు ( Polavaram project ) పై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ( Ex mp Undavalli arun kumar ) కీలక విషయాలు బయట పెట్టారు. పోలవరం విషయంలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ( Ex cm chandrababu naidu ) కాంప్రమైజ్ అయ్యారని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ జీవనరేఖ ( Ap lifeline ) పోలవరం ప్రాజెక్టు విషయంలో చాలా తప్పులు జరిగాయని..అందుకే ఇప్పుడీ పరిస్థితి తలెత్తిందని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ తప్పులన్నింటినీ ఎప్పటికప్పుడు అప్పటి టీడీపీ ప్రభుత్వం ( Tdp Government ) దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. రిజర్వాయర్ నిర్మించేందుకు అవకాశమున్నది పోలవరం ప్రాంతం మాత్రమేనని తెలిపారు. రిజర్వాయరు లేకుండా ప్రాజెక్టే లేదని చెప్పారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ అంశం చట్టంలో ఉన్నాసరే చంద్రబాబు కాంప్రమైజ్ అయ్యారని, స్పెషల్ ప్యాకేజి పేరుతో సరిపెట్టుకున్నారని విమర్శించారు. పార్లమెంటులో చేసిన చట్టం గొప్పదా.. మోదీ ( Modi ) - చంద్రబాబు చేసుకున్న ఒప్పందం గొప్పదా అని ప్రశ్నించారు. పోలవరానికి ఇవ్వాల్సిన ఖర్చు నూటికి నూరుశాతం భరిస్తామని కేంద్రం చట్టంలోనే తెలిపిందన్నారు. లోక్ సభలో లైవ్ టెలికాస్టు ఆపడం..తలుపులు మూసి రాష్ట్రాన్ని విభజించడం ఈ సందర్బంగా ఆయన గుర్తు చేశారు.
అప్పట్లో ఇచ్చిన హామీలను కూడా ఇప్పుడెందుకు అమలు చేయడం లేదని కేంద్రాన్ని నిలదీశారు. పోలవరం ప్రాజెక్టును పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. పార్లమెంట్‌లో చేసిన చట్టాన్ని బైపాస్ చేయలేరని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అఫిడవిట్ ఫైల్ చేయమని..లోక్ సభలో చర్చకు నోటీసు జారీ చేయమని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు గతంలోనే చెప్పానన్నారు. పార్లమెంట్ ( Parliament ) లో వెంకయ్య నాయుడు ( Venkaiah naidu ) అడిగిన పదివేల కోట్లు కూడా కేంద్రం ఇప్పటి వరకూ ఇవ్వలేదన్నారు.
2019, జూన్ 24న నాటి కేంద్రమంత్రికి చంద్రబాబు ప్రభుత్వం పంపిన 57 వేల 218 కోట్ల రూపాయల పోలవరం వ్యయ ప్రతిపాదనల్లో 1748 కోట్లు తగ్గించి ఆమోదించారని చెప్పారు. పోలవరానికి 35 వేల కోట్ల రూపాయలు మనం ఎందుకు పెట్టుబడి పెట్టాలని ప్రశ్నించారు. నాడు కేవీపీ వేసిన పిటిషన్‌లో ఇంప్లీడ్ పిటిషన్ ఫైల్ చేసి..తానే వాదిస్తానని ఉండవల్లి తెలిపారు. Also read: AP: నవంబర్ 2 నుంచే స్కూల్స్, కాలేజీలు ప్రారంభం, షెడ్యూల్ విడుదల