PDRDG Funds: లోటు బడ్జెట్‌తో ఇబ్బంది పడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొద్దిగా ఊరట లభించింది. దేశంలో రెవిన్యూ కొరత కింద 14 రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు నిధులు విడుదలయ్యాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పోస్ట్ డివల్యూషన్ రెవిన్యూ డెఫిసిట్ గ్రాంట్‌లో భాగంగా కేంద్ర ఆర్ధిక శాఖ దేశంలోని 14 రాష్ట్రాలకు నిధులు విడుదల చేసింది. 14 రాష్ట్రాలకు కలిపి నాలుగో విడతలో భాగంగా మొత్తం 7 వేల 183 కోట్లు విడుదల చేయగా..అందులో కొద్దిగా ఏపీ దక్కించుకుంది. ఆర్ధికంగా లోటు బడ్జెట్ తో ఇబ్బంది పడుతున్న ఆంధ్ర ప్రదేశ్‌కు ఇది కాస్త ఊరట కల్గించే అంశం. 


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాలుగవ విడత పోస్ట్ డివల్యూషన్ రెవిన్యూ డెఫిసిట్ గ్రాంట్‌లో భాగంగా 879 కోట్లు విడుదలయ్యాయి. 2022-23 సంవత్సరానికి ఏపీ రెవిన్యూ డెఫిసిట్ గ్రాంట్ 10 వేల 549 కోట్లు సిఫారసు చేయగా ఇప్పటివరకూ 3 వేల 516 కోట్లు విడుదలయ్యాయి. జూలై నెల నాలుగవ విడతలో భాగంగా 879 కోట్లు ఏపీకు విడుదల కాగా, రెండవ స్థానంలో అస్సోంకు 407 కోట్లు విడుదలయ్యాయి. 


పోస్ట్ డివల్యూషన్ రెవిన్యూ డెఫిసిట్ గ్రాంట్ కింద సిఫారసు చేయబడిన 14 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, అస్సోం, హిమాచల్ ప్రదేశ్, కేరళ, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలున్నాయి. 


Also read: Heavy Rains: ఏపీ, తెలంగాణలో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు, మరో మూడ్రోజులు వర్షాలే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook