ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిపాలనపై యూఎస్ కాన్సులేట్ జనరల్ జోయల్ ప్రశంసలు కురిపించారు. సంక్షేమ పథకాలు, కోవిడ్ మేనేజ్‌మెంట్ బాగున్నాయని కితాబిచ్చారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఆంధ్రప్రదేశ్( Andhra pradesh ) విశాఖపట్నంలో హబ్ ఏర్పాటుకు అమెరికా ( America ) ముందుకొచ్చింది. దేశంలోనే రెండవ హబ్‌ను అమెరికా విశాఖలో ఏర్పాటు చేయనుంది. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) స్వాగతించారు. అమెరికా కాన్సులేట్ జనరల్ జోయల్ రీఫ్‌మెన్ ( Us consulate General ), కాన్సులేట్ అధికారులు డేవిడ్ మోయర్, సీన్‌రూథ్‌లతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖలో భేటీ అయ్యారు.  


ఈ సందర్భంగా వైఎస్ జగన్ పాలన ( Ys Jagan Ruling ) ను అమెరికా కాన్సులేట్ జనరల్ జోయల్ ప్రశంసించారు. అవినీతి తావు లేకుండా సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తున్నారని జోయల్ తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో అమలవుతున్న కోవిడ్ మేనేజ్‌మెంట్‌కు కితాబిచ్చారు.  


రాష్ట్రంలో పెట్టుబడులకు అమెరికా కాన్సులేట్ జనరల్ చొరవ చూపించాలని జగన్ కోరారు. స్మార్ట్‌సిటీ ( Smart city ) గా విశాఖపట్నం ( Visakhapatnam ) అభివృద్ధికి సహకరించాలన్నారు. పెట్టుబడులకు ఏపీ ( AP ) అత్యంత అనుకూల రాష్ట్రమని చెప్పారు. రాష్ట్ర ప్రగతికి సహకరించాలని..విశాలమైన సముద్ర తీరప్రాంతం దోహదపడుతుందన్నారు. నౌకాశ్రయాల నిర్మాణం, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల రంగంపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. 


Also read: AP: రామతీర్ధం ఘటనపై ప్రారంభమైన సీఐడీ విచారణ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook