Secunderabad To Tirupati Vande Bharat Train: దేశవ్యాప్తంగా వందే భారత్ రైళ్లకు ఆదరణ పెరుగుతుంది. మన తెలుగు రాష్ట్రాలకు మరో వందేభారత్‌ ట్రైన్ రానుంది. సికింద్రాబాద్‌-తిరుపతిల మధ్య ఈ రైలు నడవనున్నట్లు తెలుస్తోంది. ఈ ట్రైన్ ను ఏప్రిల్ లో ప్రారంభించే అవకాశాలున్నాయి. వచ్చే నెలలో ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఈరైలును ప్రధాని జెండా ఊపి ప్రారంభించనున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సంక్రాంతి కానుకగా ఏపీ, తెలంగాణ మధ్య తొలి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీనికి వస్తున్న ఆదరణ నేపథ్యంలో మరో రైలును నడపాలని రైల్వేశాఖ నిర్ణయించింది. దీని కోసం తిరుపతి-సికింద్రాబాద్‌ మార్గాన్ని ఎంచుకుంది. ఎందుకంటే నిత్యం హైదరాబాద్ నుంచి తిరుపతికి వేల సంఖ్యలో భక్తులు ప్రయాణిస్తుంటారు. నెలరోజుల ముందు ప్రయత్నిస్తే తప్ప రిజర్వేషన్ దొరకదు. 


ప్యాసింజర్స్ నుంచి వస్తున్న డిమాండ్ నేపథ్యంలో సికింద్రాబాద్‌-తిరుపతిల మధ్య వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభించాలని  రైల్వేశాఖ నిర్ణయించింది. ఈ రైలును నల్గొండ-మిర్యాలగూడ-గుంటూరు మార్గంలో నడిపించాలని రైల్వేశాఖ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ఏయే స్టేషన్లలో ఆగుతుంది, ఛార్జీలు ఎంత ఉంటాయి, ప్రయాణ సమయంపై క్లారిటీ రావాల్సి ఉంది. 


Also Read: LB Nagar RHS flyover Photos: గుడ్ న్యూస్.. సిటీలో అందుబాటులోకి ఎల్బీ నగర్ ఆర్‌హెచ్ఎస్ ఫ్లైఓవర్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి