కృష్ణాజిల్లాలో వైసీపీ పెద్ద షాక్ అగిలింది. విజయవాడ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా పార్టీకి గుడ్ చెప్పారు.  విజయవాడ సెంట్రల్‌ టికెట్ ఆశించిన రాధాకు షాక్ ఇస్తూ  జగన్‌ విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గ బాధ్యతలను  మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు అప్పగించారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైనా రాధాకృష్ణ పార్టీ నిర్ణయంపై తీసుకున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొడాలి నాని బుజ్జగింపు


విజయవాడ సెంట్రల్ టికెట్ విషయంలో గతంలో రాజీనామాకు సిద్ధమైనప్పటికీ రాధాకృష్ణకు సన్నిహితంగా ఉండే గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని బుజ్జగించడంతో రాధాకృష్ణ కొంతకాలం మౌనంగా ఉన్నారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో అంటీ ముట్టనట్లు వ్యవహారిస్తున్నారు.


ఎన్నికల దగ్గర పడుతున్నాయి...


సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో మళ్లీ సెంట్రల్‌ టిక్కెట్‌ వ్యవహారం తెరపైకి వచ్చింది. తనకు మంచి పట్టున్న సెంట్రల్ టికెట్ తనకు ఇక ఇవ్వరని..వేరే దారిలో తీసుకోవాలని భావించిన రాధా ఈ మేరకు రాజీనామా చేశారు


వైసీపీలో అన్ని ఆంక్షలే..


పేద ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే నా ప్రయాణం. ప్రజల ఆశయాలను కొనసాగించే దిశలో ప్రయాణం సాగించాలన్నదే నా కోరిక. సీఎం కావాలన్న మీ కాంక్ష నెరవేరాలంటే వైసీపీలో అందరికీ ఆంక్షలు విధించడం తప్పనిసరి. నా ఆకాంక్ష నెరవేరాలంటే ఆంక్షలు లేని ప్రజా ప్రయాణం తప్పనిసరి  అని రాధాకృష్ణ.. జగన్‌కు రాసిన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.