వంగవీటి రాధా జనసేనలో చేరినట్లేనా ?
బెజవాడ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి
అమరావతి: వంగవీటి రాధా జనసేన వైపు చూస్తున్నానే ఊహాగానాలు కాస్త నిజమయ్యేలా ఉన్నాయి. ఈ రోజు ఉదయం మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌తో రాధా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురు నేతలు రెండు గంటల పాటు చర్చించారు. భేటీ అంతరం ఆయన జనసేన పార్టీలో చేరుతున్నట్లు ప్రకటిస్తారని అందరూ భావించారు..అయితే అలా జరగలేదు. అయితే అసలు ఆయన జనసేనలో చేరుతారా ? చేరితో ముహుర్తం ఎప్పుడనే దానిపై ఉత్కంఠత నెలకొంది . పార్టీ కార్యకర్తలతో చర్చించి ఈ రోజు లేదా రేపు జనసేనలోకి చేరనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
ఎన్నికలకు ముందు విజయవాడ సెంట్రల్ టికెట్ విషయంలో వైసీపీ అధినేత తీరుతో విభేదించిన రాధా పార్టీ మారి టీడీపీలో చేరారు. నిజానికి ఎన్నికల సమయంలో వైసీపీని వీడినప్పుడే ఆయన తదుపరి అడుగు జనసేన వైపే ఉంటుందని అంతా భావించారు. అయితే అప్పటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో కొద్దిరోజులు వేచి చూసిన రాధా టీడీపీలో చేరిపోయారు. అయితే పార్టీలో సరైన ప్రాధాన్యత ఇవ్వలేదనే కారణంతో రాధా ... జనసేన పార్టీలోకి లోకి వెళ్లాలని డిసైడ్ అయినట్లు కథనాలు వెలువడుతున్నాయి.