బెజవాడ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీకి గుడ్ చెప్పిన వంగవీటి రాధా.. టీడీపీలోకి వెళ్లారని అందరూ అనుకున్న తరుణంలో రాధా కీలక వ్యాఖ్యలు చేశారు.  విజయవాడలో ఏర్పాటు చేసిన విలేఖరల సమావేశంలో వంగవీటి రాధా మాట్లాడుతూ తాను టీడీపీలోకి వెళ్లడం లేదని మరో పరోక్ష ప్రకటన చేశారు. అయితే ఆయన ఏ పార్టీలోకి వెళ్తారన్న విషయంపై  క్లారిటీ ఇవ్వలేదు. తనను టీడీపీ చేరమని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానించారని .. ఈ విషయంలో తనను మన్నించాలని పేర్కొని టీడీపీ ఆఫర్ ను తిరస్కరించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీడీపీలో చేరికపై వస్తున్న వార్తలపై వంగవీటి రాధా స్పందిస్తూ తనకు పదవులు అవసరం లేదని..తండ్రి ఆశయాలు, పేదల సంక్షేమం ముఖ్యమన్నారు.. వీలైతే విజయవాడలోని పేదల ఇళ్లకు పట్టాలు పంచాలని కోరారు. ఇదే సందర్భంలో తాను  ప్రజా జీవితంలో కొసాగుతానని స్పష్టం చేశారు. అయితే ఆయన ఏ పార్టీలో చేరుతారనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. దీంతో వంగవీటి రాధా పొలిటికల్ కెరీర్ పై ఉత్కంఠ నెలకొంది


వంగవీటి ముందు రెండే ఆప్షన్లు


ఒకవైపు వైసీపీకి రాజీనామా చేసి జగన్ పై తీవ్ర ఆరోపణలు చేస్తున్న వంగవీటి రాధా.. ఇటు టీడీపీ ఆహ్వానాన్ని తిరస్కరిస్తున్నారు. ఇదే సమయంలో తాను ప్రజా జీవితంలో కొనసాగుతానని చెబుతున్నారు. దీంతో ఆయన పొలిటికల్ కెరీస్ పై రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. రాధా పొలిటికల్ కెరీర్ కొనసాగించాలంటే ఆయన ముందు  ప్రధానంగా రెండే రెండు ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి జనసేన..రెండో ఇండిపెండెంట్ గా పోటీ చేయడం. 


పవన్ సెంట్రల్ టికెట్ ఆఫర్ ఇస్తే...!
వాస్తవానికి వంగవీటి రాధా విజయవాడ సెట్రల్ లో పోటీ చేయాలని భావిస్తున్నారు. వైసీపీ ఈ టికెట్ పై క్లారిటీ ఇవ్వనందుకే ఆయన పార్టీ వీడారు..ఇటు టీడీపీ కూడా విజయవాడ సెంట్రల్ విషయంలో ఇవ్వలేమని తేల్చిచెబుతూ ఎమ్మెల్సీ ఆఫర్ ఉంచినట్లు కథనాలు వెలువడ్డాయి. దీంతో వంగవీటి టీడీపీ ఆఫర్ ను తిరస్కరించారు. ఇప్పుడు రాష్ట్రంలో ఏదైన ప్రధాన రాజకీయ పార్టీ తరఫున పోటీ చేయాలంటే రాధా ముందు ఒకే ఒక్క ఆపన్ష్  ..అది జసనేన పార్టీ. ఈ నేపథ్యంలో వంగవీటి రాధా...జనసేన పార్టీ మధ్య చర్చలు నడుస్తున్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. విజయవాడ సెంట్రల్ టికెట్ ఇచ్చేందుకు పవన్ ముందుకు వస్తే ఆయన జనసేన చేరేందుకు సముఖత వ్యక్తం చేసే అవకాశముందని రాజకీయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి


ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా ?


మరోవైపు ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఎన్నికల్లో సత్తా చాటాలనే టాక్ కూడా వినిపిస్తోంది.రంగా అభిమానులు అన్ని పార్టీల్లో ఉన్నారని చెబతున్న రాధా..తాను ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలవాలనే ఆలోచనలో ఉన్నట్లు కొందరు గుసగుసలాడుకుంటున్నారు. అయితే ప్రస్తుతం  పరిస్థితుల్లో ఈ సాహసం చేసేందుకే వంగవీటి రాధా సాహసిస్తారా అనేది ఇక్కడ ఉత్పన్నమౌతున్న ప్రశ్న. ఈ నేపథ్యంలో వంగవీటి భవిష్యత్తు  రాజకీయ పయనం ఎలా ఉండబోతుందనేది దానిపై ఉత్కంఠత నెలకొంది.