Vijayasai Reddy criticises Chandrababu: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను టీడీపీ అధినేత చంద్రబాబుకు ముడిపెడుతూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అప్పట్లో చంద్రబాబుతో జతకట్టి చేతులు పైకెత్తిన పార్టీలన్నీ ఈ ఎన్నికల్లో కళ్లు తేలేశాయని ఎద్దేవా చేశారు. 'బాబు లెగ్ అలాంటిది మరి.. యూపీని మళ్లీ గెలుచుకున్న బీజేపీకి అభినందనలు చెప్పి వారి చంకలో దూరాలని ఉన్నా... వేచి చూస్తున్నాడు. అఖిలేశ్, మాయావతి ఫోన్లు చేసి ఎక్కడ దులిపేస్తారోనని కలవరం కాబోలు' అంటూ విజయసాయి రెడ్డి చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. ఈ మేరకు విజయసాయి రెడ్డి ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరో ట్వీట్‌లో.. 'చంద్రబాబుది గుంటనక్క బుద్ధి అని తెలిసే మోదీ గారు దూరం పెట్టారు. వంగి వంగి దండాలు పెట్టే రోజుల్లో అయితే తాను పుతిన్‌ను ఒప్పించి యుద్ధం ఆపిస్తానని వీర బిల్డప్పులు ఇచ్చేవారు. పోలాండ్‌లో మకాం పెట్టి మా బాబే విద్యార్ధులను ఫ్లైట్లు ఎక్కించాడనే ఎల్లో మీడియా స్టోరీలు జనానికి కంపరం పుట్టించేవి.' అని విజయసాయి రెడ్డి విమర్శలు సంధించారు.


కాగా, 2018లో బెంగళూరులో జరిగిన సీఎం కుమారస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రతిపక్షాల బల ప్రదర్శనకు వేదికగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమానికి యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి, అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కమ్యూనిస్టు నాయకులు, తదితర పార్టీల నేతలు హాజరయ్యారు. ఆ సందర్భంగా ప్రతిపక్ష నేతలంతా కలిసి చేతులు పైకెత్తి తమ ఐక్యతను చాటుకున్నారు. తాజా యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్, సమాజ్‌వాదీ, బీఎస్పీలకు పరాభవం ఎదురైన నేపథ్యంలో.. అప్పట్లో చంద్రబాబుతో జతకట్టి చేతులు పైకెత్తిన పార్టీలన్నీ కళ్లు తేలేశాయంటూ తాజాగా విజయసాయి రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.



Also Read: CM Yogi Adityanath News: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వేషధారణకు ఆ రాష్ట్రంలో విపరీతమైన క్రేజ్!


Also Read: UP Election Results: ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ జోరు... కాషాయ పార్టీ గెలుపుకు దోహదం చేసిన అంశాలివే..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook