Chandrababau Naidu: ఆ ముగ్గురు నిందితులకు ఉరిశిక్ష వేయించండి... విజయవాడ `గ్యాంగ్ రేప్`పై చంద్రబాబు రియాక్షన్...
Vijayawada Gang Rape Incident: విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనపై స్పందించిన చంద్రబాబు... ముగ్గురు నిందితులకు ఉరి శిక్ష వేయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Vijayawada Gang Rape Incident: విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో గ్యాంగ్ రేప్‌కు గురై ప్రస్తుతం ఓల్డ్ గవర్నమెంట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న బాధితురాలిని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పరామర్శించారు. బాధితురాలితో పాటు ఆమె తల్లిదండ్రులతో మాట్లాడారు. న్యాయం జరిగేవరకూ టీడీపీ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
వైసీపీ పాలనలో సంఘ విద్రోహ శక్తులు రెచ్చిపోతున్నారని చంద్రబాబు ఆరోపించారు. దానికి ప్రభుత్వం వంత పాడుతోందన్నారు. ఆడబిడ్డల మనోవేదన ప్రభుత్వానికి తెలియట్లేదని.. రాష్ట్రంలో ఇంకెన్ని మానభంగాలు జరగాలని ప్రశ్నించారు. ఇటీవలి కాలంలో గుంటూరు, తాడేపల్లి, పల్నాడుల్లో అత్యాచార ఘటనలు వెలుగుచూశాయన్నారు. రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు.
బాధితురాలికి న్యాయం చేసేందుకు వెంటనే స్పెషల్ కోర్టు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని చంద్రబాబు డిమాండ్ చేశారు. ముగ్గురు నిందితులకు ఉరి శిక్ష వేయించాలన్నారు. బాధితురాలికి రూ.1కోటి పరిహారంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం, ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీడీపీ తరుపున బాధితురాలికి రూ.5 లక్షలు అందజేస్తున్నట్లు వెల్లడించారు. ఆడబిడ్డకు న్యాయం జరిగేవరకూ... నిందితులకు శిక్ష పడేంతవరకూ టీడీపీ పోరాడుతుందన్నారు. ఎవరికో జరిగింది కదా మనకెందుకు అని ప్రజలు భావించొద్దన్నారు.
సీఎం జగన్ తన చెంచాలతో మాట్లాడిస్తే తామేమీ భయపడిపోమని... ఒక్క అవకాశమని చెప్పి ఇప్పుడు రాష్ట్రాన్ని తగలబెడుతున్నారని చంద్రబాబు ఫైర్ అయ్యారు. దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా దానికి చిరునామా ఆంధ్రప్రదేశ్ అనే పరిస్థితి వచ్చిందన్నారు. రాష్ట్రంలో శాంతి లేని పరిస్థితి నెలకొందన్నారు.
Also Read: Gang Rape: విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో దారుణం... యువతిని 30 గం. పాటు బంధించి గ్యాంగ్ రేప్...
Also Read: KGF 2 OTT Release: 'కేజీఎఫ్' ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... చాప్టర్ 2 ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.