Mamata Banerjee on Chandrababu Naidu: గతేడాది పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా పెగాసస్ స్పై వేర్ వ్యవహారం దేశవ్యాప్తంగా ఎంత ప్రకంపనలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇజ్రాయెల్‌కి చెందిన కంపెనీ నుంచి కొనుగోలు చేసిన ఈ స్పై వేర్‌తో దేశంలోని 300 మంది ప్రముఖులపై కేంద్రం నిఘా పెట్టిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం దీనిపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోంది. ఇదే స్పై వేర్ వ్యవహారం ఇప్పుడు ఏపీలోనూ పెను దుమారం రేపుతోంది.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం (మార్చి 16) ఆ రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడుతూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. పెగాసస్ స్పై వేర్‌ను రూ.25 కోట్లకు విక్రయిస్తామంటూ నాలుగైదేళ్ల క్రితం కొంతమంది బెంగాల్ పోలీసులను సంప్రదించారని మమతా పేర్కొన్నారు. ఆ విషయం తెలిసి అందుకు తాను తిరస్కరించినట్లు తెలిపారు. అదే సమయంలో ఏపీలోని అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఆ స్పై వేర్‌ను కొనుగోలు చేసిందన్నారు. మమతా చేసిన ఈ వ్యాఖ్యలు చంద్రబాబును చిక్కుల్లోకి నెట్టినట్లయింది.
మమతా బెనర్జీ వ్యాఖ్యలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. మమతా బెనర్జీ నిజంగా ఆ వ్యాఖ్యలు చేశారో లేదో.. ఏ సందర్భంలో ఆమె అలా మాట్లాడారో స్పష్టత లేదన్నారు. ఒకవేళ ఆమె అలా మాట్లాడి ఉంటే.. అది కచ్చితంగా తప్పుడు సమాచారమేనని అన్నారు. అదే సమయంలో, ఆ సాఫ్ట్‌వేర్ కొనుగోలు చేయమని తమనూ సంప్రదించారని.. కానీ అందుకు తాము తిరస్కరించామని పేర్కొన్నారు. ఒకవేళ ప్రభుత్వం ఆ స్పై వేర్‌ను కొనుగోలు చేసి ఉంటే.. దాని వివరాలు రికార్డుల్లో ఉండేవన్నారు.
మమతా వ్యాఖ్యలను లోకేష్ ఖండించినప్పటికీ.. అధికార వైసీపీకి ఆమె వ్యాఖ్యలు ఓ అస్త్రాన్ని అందించినట్లయింది. పెగాసస్ స్పై వేర్ వ్యవహారంలో అధికార వైసీపీ టీడీపీని ఇరుకునపెట్టేందుకు ప్రయత్నించవచ్చు. ఇదే వ్యవహారంపై టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ట్విట్టర్‌లో స్పందించారు. గత టీడీపీ ప్రభుత్వం పెగాసస్ స్పై వేర్‌ను కొనుగోలు చేయలేదని గతంలో డీజీపీ గౌతమ్ సవాంగ్ స్వయంగా వెల్లడించారని పేర్కొన్నారు. నాగేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి ఆర్టీఐ ద్వారా ఆ సమాచారం కోరగా సవాంగ్ స్పందించినట్లు తెలిపారు. ఇప్పటికైతే వైసీపీ నేతలెవరూ ఈ వ్యవహారంపై స్పందించలేదు.
నాటి చంద్రబాబు ప్రభుత్వం పెగసిస్ సాఫ్ట్ వేర్ కొనలేదని స్వయంగా నీ సవాంగన్నే చెప్పారు జగన్ రెడ్డి.సమాచార హక్కు చట్టం ప్రకారం 25-7-21 న కర్నూలు జిల్లాకి చెందిన నాగేంద్రప్రసాద్ అనే వ్యక్తి అడిగిన ప్రశ్నకు సమాధానంగా అసలు అటువంటి సాఫ్ట్ వేర్ ఏదీ కొనలేదని స్వయంగా నాటి డిజిపి సవాంగ్, 1/2 pic.twitter.com/IZFdBN9w4f
— Ayyanna Patrudu (@AyyannaPatruduC) March 18, 2022
Also Read: Kashmir files: కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్‌కు Y క్యాటగిరీ భద్రత- కారణాలివే..
Also read: Salute Movie Review: సెల్యూట్ మూవీ రివ్యూ.. పోలీస్ ఆఫీసర్ గా దుల్కర్ సల్మాన్ మెప్పించాడా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook