Vijayawada Lok Sabha Election Result 2024: ఆంధ్రప్రదేశ్‌లోని కీలకమైన లోక్‌సభ నియోజకవర్గాల్లో అతి ముఖ్యమైంది విజయవాడ. రాజకీయంగా అత్యంత చైతన్యం కలిగిన కృష్ణా జిల్లా పరిధిలో వచ్చే నియోజకవర్గం. ఈసారి ఇక్కడ్నించి స్వయానా సోదరులు పోటీ పడ్డారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సామాజికవర్గం పరంగా తెలుగుదేశంను ఆదరించే కమ్మ వర్గం ప్రాబల్యం కలిగిన నియోజకవర్గం విజయవాడ. రాజధాని ప్రాంతం కావడంతో అందరి దృష్టీ విజయవాడపై పడింది. అంతకుమించి మారిన రాజకీయ సమీకరణాలతో ఇక్కడ్నించి స్వయనా సోదరులు ప్రత్యర్ధులయ్యారు. కేశినేని నాని వర్సెస్ కేశినేని చిన్నిల పోటీ ఆసక్తిగా మారింది. 


విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గానికి ఇప్పటి వరకూ అంటే 1952 నుంచి 15 సార్లు ఎన్నికలు జరిగాయి. 11 సార్లు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. 1984లో తొలిసారి టీడీపీ నుంచి వడ్డే శోభనాద్రీశ్వరరావు గెలిచారు. 2014-2019లో వరుసగా రెండుసార్లు టీడీపీ అభ్యర్ధి కేశినేని నాని విజయం సాధించారు. 2014లో కేశినేని నానికి 5,92,696 ఓట్లు వస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయిన కోనేరు రాజేంద్రప్రసాద్‌కు 5,17,834 ఓట్లు దక్కాయి. ఈ ఎన్నికల్లో దేవినేని అవినాష్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి కేవలం 39,751 ఓట్లు సాధించారు. 


ఇక 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి కేశినేని నాని 5,75,498 ఓట్లు సాధించి రెండోసారి గెలిచారు. ఈ ఎన్నికల్లో సమీప అభ్యర్ధి వైసీపీ నుంచి పోటీ చేసిన పొట్లూరి ప్రసాద్ 5,66,772 ఓట్లు దక్కించుకున్నారు. ఈసారి మాత్రం స్వయానా సోదరులు పోటీ పడటం ఆత్యంత ఆసక్తిగా మారింది. సోదరుల మధ్య వైరుధ్యం, తెలుగుదేశం పార్టీ అధినేత సహా ఇతర నేతలు సోదరుడు చిన్నివైపే మొగ్గు చూపడంతో కేశినేని నాని పార్టీ వీడి వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఇప్పుడు వైసీపీ నుంచి తమ్ముడిపై పోటీ పడ్డారు. 


రాష్ట్రవ్యాప్తంగా వీచిన కూటమి గాలిలో కేశినేని నాని ప్రభావం ఈసారి కన్పించలేదు. తెలుగుదేశం తరపున పోటీ చేసిన కేశినేని చిన్ని...వైసీపీ అభ్యర్ది సొంత అన్న కేశినేని నానిపై దాదాపుగా 2 లక్షల 80 వేల మెజార్టీతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి కేశినేని చిన్నికి 7 లక్షల 34 వేలకు పైగా ఓట్లు రాగా వైసీపీ అభ్యర్ది కేశినేని నానికి 4 లక్షల 72 వేల ఓట్లు దక్కాయి.


Also read: Rajahmundry Lok Sabha Election Result: రాజమండ్రి పీఠం రాజుదా రాణిదా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook