Vijayawada news Doctor Ravali CPR to Boy on The Road  Vijayawada: వైద్యో నారాయణో హరి అని చెబుతుంటారు. అంటే వైద్యులు దేవునితో సమానం అని చెబుతుంటారు. కొందరు వైద్యులు ఇటీవల తమ వృత్తికి చెడ్డపేరు తీసుకొని వచ్చేలా ప్రవర్తిస్తున్నారు. సమస్యలతో ఆస్పత్రికి వచ్చే రోజుల పట్ల ఇష్టమోచ్చినట్లుప ప్రవర్తిస్తున్నారు. కొందరు వైద్యులు పెషెంట్లకు సర్జరీలు చేసి ఇటీవల, కడుపులో కాటన్, కత్తెరలు మర్చిపోయిన ఘటనలు వార్తలలో నిలిచాయి. మరికొందరైతే.. వేలికి సర్జరీ చేయమంటే, నాలకకు ఆపరేషన్ చేశారు. ఇలాంటి ఘటనలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి. వీరి వల్ల పూర్తిగా వైద్య వృత్తికి చెడ్డపేరు వచ్చింది. కానీ కొందరు వైద్యులు మాత్రం రోగులను తమ ఇంట్లో వాళ్లలా చూసుకుంటూ, వారి ప్రాణాలను కాపాడుతున్నారు. ప్రజలతో మన్ననలను పొందుతున్నారు. ప్రస్తుతం ఈ  కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



పూర్తి వివరాలు.. 


విద్యుదాఘాతానికి గురై కుప్పకూలి ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలుడ్ని భుజాన వేసుకుని ఆస్పత్రికి పరుగెత్తుతున్న తల్లిదండ్రులకు ఆ డాక్టరమ్మ దేవతలా ప్రత్యక్షమైంది.  రోడ్డుపైనే సీపీఆర్ చేసి చిన్నారికి ఊపిరి పోసింది. ఈనెల 5న విజయవాడలో జరిగిన ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం వైరల్ గా  మారింది. విజయవాడ అయ్యప్పనగర్‌కు చెందిన ఆరేళ్ల బాలుడు సాయి ఈ నెల 5వ తేదీన ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురయ్యాడు.  తల్లిదండ్రులు ఎంత పిలిచినా కూడా తమ పిల్లాడి నుంచి  ఉలుకూ పలుకూ లేదు. ఒక్కసారిగా వారి గుండె ఆగినంత పనైంది. తన్నుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకొని, బిడ్డను భుజాన వేసుకొని ఆసుపత్రికి పరుగులు తీశారు. ఈ దృశ్యాలు అక్కడున్న వారిని తీవ్రంగా కలచివేశాయి.


మెడ్‌సీ ఆసుపత్రిలో ప్రసూతి వైద్య నిపుణురాలైన డాక్టర్‌ నన్నపనేని రవళి అటుగా వెళ్తూ ఇదంతా గమనించారు. తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. బాలుడ్ని పరీక్షించి అక్కడే రోడ్డుపైనే పడుకోబెట్టమని చెప్పారు. అనంతరం కార్డియో పల్మోనరీ రిససిటేషన్‌-సీపీఆర్ చేయడం ప్రారంభించారు. ఒకవైపు డాక్టర్‌ రవళి బాలుడి ఛాతీపై చేతితో ఒత్తుతూ అక్కడున్న మరో వ్యక్తిని నోటితో గాలి ఊదమని సూచించారు. ఇలా ఏడు నిమిషాలకు పైగా చేశాక బాలుడిలో కదలిక వచ్చింది. వైద్యురాలి కృషి ఫలించడంతో ఆ బాలుడు మళ్లీ ఊపిరితీసుకున్నాడు.


Read more: Dice Snakes: ఆస్కార్ లెవల్ పర్ఫామెన్స్.. చచ్చిపోయినట్లు నటిస్తున్న పాములు.. కారణం ఏంటో తెలుసా..?


వెనువెంటనే బాలుడ్ని దగ్గరలో ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి బైక్‌పై తీసుకెళ్లారు. ఆసుపత్రికి వెళ్లే మార్గంలోనూ బాలుడికి శ్వాస సరిగ్గా అందేలా తలను కొద్దిగా కిందకి ఉంచి పడుకోబెట్టి తీసుకెళ్లమని సూచించారు. ఆసుపత్రికి వెళ్లిన తర్వాత చికిత్స చేయడంతో పూర్తిగా కోలుకున్నాడు. 24 గంటలు అబ్జర్వేషన్‌లో ఉంచి తలకు సీటీ స్కాన్‌ చేస్తే ఎలాంటి సమస్య లేదని గుర్తించి, డిశ్చార్జి చేసి ఇంటికి పంపించేశారు. ప్రస్తుతం బాలుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడు. డాక్టర్‌ రవళి రోడ్డుపైనే బాలుడ్ని పడుకోబెట్టి సీపీఆర్‌ చేసే సమయంలో తీసిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. వైద్యురాలి పట్ల ప్రశంసల వర్షం కురుస్తోంది. అత్యవసర సమయంలో సీపీఆర్ ఎంతగా ఉపయోగపడుతుందనేందుకు ఈ ఘటన నిదర్శనంగా నిలుస్తోంది. ప్రస్తుతం లేడీ డాక్టర్ ను సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter