Illegal Migration: ఇండియాలో బంగ్లా యువకుల అక్రమ వలస, విజయవాడలో నలుగురు అదుపులో
Illegal Migration:దేశంలో కలకలం కల్గించిన దర్బంగా ఘటన నేపధ్యంలో ఏపీ పోలీసులు అప్రమత్తమయ్యారు. నిఘా వ్యవస్థను పటిష్టం చేశారు. అక్రమంగా ఇండియాలో ప్రవేశించిన నలుగురిని పోలీసులు అదుపులో తీసుకున్నారు.
Illegal Migration:దేశంలో కలకలం కల్గించిన దర్బంగా ఘటన నేపధ్యంలో ఏపీ పోలీసులు అప్రమత్తమయ్యారు. నిఘా వ్యవస్థను పటిష్టం చేశారు. అక్రమంగా ఇండియాలో ప్రవేశించిన నలుగురిని పోలీసులు అదుపులో తీసుకున్నారు.
బీహార్ దర్భంగా రైల్వే స్టేషన్ పేలుడు ఘటన (Darbanga Incident) దేశవ్యాప్తంగా సంచలనం కల్గించింది. ఈ ఘటన నేపధ్యంలో దేశవ్యాప్తంగా పోలీసులు, రైల్వే శాఖ అప్రమత్తమైంది. ఇటు ఏపీ పోలీసులు కూడా నిఘా వ్యవస్థను పటిష్టం చేశారు. ఇండియాలో అక్రమంగా ప్రవేశించేవారిపై కన్నేశారు.ఇందులో భాగంగా దేశంలో అక్రమంగా ప్రవేశించిన(Illegal Migration)నలుగురు బంగ్లాదేశ్ యువకుల్ని విజయవాడ పోలీసులు అదుపులో తీసుకున్నారు. బంగ్లాదేశ్‌లోని తల్లానా జిల్లా నుంచి ఇండియాలోకి ప్రవేశించినట్టు తేలింది. హౌరా-వాస్కోడిగామా ట్రైన్‌లో ప్రయాణిస్తుండగా రైల్వే పోలీసులు పట్టుకున్నారు. పాస్‌పోర్ట్ లేకుండా ఇండియాలో ప్రవేశించినట్టు గుర్తించారు.
ఈ నలుగురు బంగ్లాదేశ్ (Bangladesh) యువకులు ఇండియా రావడానికి గల కారణాల్ని లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఉపాధి కోసమే దేశంలో ప్రవేశించినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. బంగ్లాదేశీయులు పలు రాష్ట్రాల్లో అక్రమంగా చొరబడి నివాసం ఏర్పర్చుకున్నారని పోలీసులు తెలిపారు. నిందితుల్నించి నకిలీ ఆధార్ , పాన్‌కార్డుల్ని స్వాధీనం చేసుకున్నారు.
Also read: Corona Vaccination: దేశంలో జోరందుకున్న కరోనా వ్యాక్సినేషన్, ఇప్పటి వరకూ 34 కోట్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook