Corona Vaccination: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరందుకుంది. వివిధ కంపెనీల్లో వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్ధ్యం పెరగడంతో వ్యాక్సిన్ సరఫరా పెరిగింది. మరోవైపు కొత్త వ్యాక్సిన్లు దేశంలో అందుబాటులో రానున్నాయి.
కరోనా మహమ్మారి కట్టడికి వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం. ఇప్పటికే దేశంలో మూడు రకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. మేకిన్ ఇండియా వ్యాక్సిన్, భారత్ బయోటెక్ కంపెనీ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్(Covaxin), సీరమ్ ఇనిస్టిట్యూట్ ఉత్పత్తి చేస్తున్న ఆస్ట్రాజెనెకాకు చెందిన కోవిషీల్డ్, రష్యన్ కంపెనీ వ్యాక్సిన్ స్పుట్నిక్ వి. దేశంలో జరుగుతున్న వ్యాక్సినేషన్‌లో సింహభాగం కోవిషీల్డ్, కోవాగ్జిన్‌లదే. మరికొద్ది రోజుల్లో మోడెర్నా వ్యాక్సిన్(Moderna Vaccine), జైడస్ క్యాడిలా వ్యాక్సిన్‌లు ఇండియాలో రానున్నాయి.ఇటీవల కొద్దికాలంగా కోవిషీల్డ్(Covishield), కోవాగ్జిన్ ఉత్పత్తి సామర్ధ్యం పెరగడంతో వ్యాక్సిన్ ప్రక్రియ జోరందుకుంది.
జూన్ 21 నుంచి కేంద్ర ప్రభుత్వం(Central government) కొత్త వ్యాక్సినేషన్ విధానం (New Vaccine policy) ప్రవేశపెట్టింది. దేశంలో ప్రతిరోజూ లక్షలాదిమందికి వ్యాక్సిన్ అందుతోంది. గత 12 రోజుల్లో దేశంలో రికార్డు స్థాయిలో 6.3 కోట్లమందికి వ్యాక్సిన్ అందింది. దేశంలో ఇప్పటి వరకూ 34 కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్ డోసులు అందించారు. గత 24 గంటల్లో 43 లక్షల 99 వేల 298 మందికి వ్యాక్సిన్ అందింది.ఇప్పటి వరకూ దేశంలో 18-44 సంవత్సరాల వయస్సు కేటగరీలో 9 కోట్ల 64 లక్షల 91 వేల 993మందికి మొదటి డోసు ఇవ్వగా..23 లక్షల 80 వేల 48మందికి రెండవ డోసు వ్యాక్సిన్ అందించారు. ఇటీవల డీసీజీఐ (DCGI) అనుమతిచ్చిన వ్యాక్సిన్‌లు కూడా అందుబాటులో వస్తే వ్యాక్సినేషన్ (Corona vaccination) ప్రక్రియ మరింత వేగవంతం కానుంది.
Also read: PM Narendra Modi: రిటైల్, హోల్‌సేల్ వ్యాపారులు ఇకపై ఎంఎస్ఎంఈ పరిధిలో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook