అమ‌రావ‌తి : ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు నవ రత్నాల అమలు బాధ్యతలను గ్రామ వాలంటీర్లకే అప్పజెప్పే లక్ష్యంతో ఏపీలో గ్రామ వాలంటీర్ల నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ మేరకు ఏపీ సర్కార్ నుంచి ఉత్తర్వులు సైతం జారీ అయ్యాయి. ఈ నెల 24వ తేదీ నుంచి జూలై 5వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించి జూలై 11వ తేదీ నుంచి 25 తేదీలోపు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు ఆగస్టు 1న నియామకపత్రాలు అందించి ఆగస్టు 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు శిక్షణ ఇవ్వనున్నారు. గ్రామ వాలంటీర్ల నియామకంలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఏపీ సర్కార్ ఆదేశాలు జారీచేసింది. గ్రామ వాలంటీర్లకు ప్రభుత్వం నెలకు రూ.5వేల వేతనం అందించనుంది. ప్రతీ 50 ఇళ్లకు ఓ గ్రామ వాలంటీరును నియమించాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గ్రామ వాలంటీర్ల నియామకం ఆన్‌లైన్ దరఖాస్తుకు లింక్ : http://gramavolunteer.ap.gov.in


అర్హతలు
 గిరిజన ప్రాంతాల్లో: 10వ తరగతి.
 గ్రామీణ ప్రాంతాల్లో: ఇంటర్మీడియెట్.
 పట్టణ ప్రాంతాల్లో: డిగ్రీ.
 వయసు: 2019 జూన్‌ 30 నాటికి 18-35 ఏళ్లు ఉండాలి. 
 దరఖాస్తుదారులు అదే పంచాయతీకి చెందిన స్థానిక నివాసి అయ్యి ఉండాలి
 ఓసీ అభ్యర్థులు కాకుండా ఇతర కులాలకు చెందిన వాపు కుల ధ్రువీకరణ పత్రాన్ని అందజేయాల్సి ఉంటుంది.