AP: ఉగాది నుంచి విశాఖకు రాజధాని
ఏపీ మూడు రాజధానుల అంశంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కట్టుబడి ఉన్నారు. ఉగాది నాడు పరిపాలనా రాజధానిని విశాఖకు మార్చాలని నిర్ణయించారు. ముహూర్తం కూడా ఫిక్స్ అయిందని తెలుస్తోంది.
ఏపీ మూడు రాజధానుల అంశంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కట్టుబడి ఉన్నారు. ఉగాది నాడు పరిపాలనా రాజధానిని విశాఖకు మార్చాలని నిర్ణయించారు. ముహూర్తం కూడా ఫిక్స్ అయిందని తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల ( Ap three capitals ) దిశగా చర్యలు సాగుతున్నాయి. ముందుగా పరిపాలనా రాజధాని ( Executive capital ) ని విశాఖ ( Visakhapatnam )కు తరలించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. వైఎస్ జగన్ ప్రభుత్వం ( Ys jagan government ) దీనికి సంబంధించి కొత్త ముహూర్తాన్ని ఫిక్స్ చేసింది. 2021 ఉగాది నాడు పరిపాలనా రాజధానిని మార్చాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాాచారం. అంటే ఏప్రిల్ 13 నుంచి విశాఖ నూతన రాజధాని కాబోతుంది.
ఏప్రిల్ 13 నుంచి ఏపీ ఎగ్జిక్యూటివ్ రాజధానిని విశాఖకు తరలించేందుకు అధికారులు సమాయత్తం కావాలని ఇప్పటికే ఉన్నతాధికార్లకు ఆదేశించినట్టు తెలిసింది. ప్రస్తుంతం ఈ అంశంపై హైకోర్టులో ఉన్న కేసులు, అడ్డంకులన్నీ ఏప్రిల్ నాటికి తొలగిపోతాయని ప్రభుత్వ భావిస్తోంది. ఈ విషయాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ ( Minister Botsa Satyanarayana ) సైతం ధృవీకరించారు.