Visakhapatnam: ఆంధ్రా ఊటీగా పేరుగాంచిన అరకు లోయకు వచ్చే పర్యాటకుల కోసం రైల్వేశాఖ మరో రెండు అద్దాల బోగీలను అందుబాటులోకి తెస్తోంది. విశాఖ(Visakhapatnam) నుంచి అరకు లోయ(araku valley)కు నడిచే రెగ్యులర్‌ ట్రైన్‌కు వీటిని జత చేసేందుకు  రైల్వే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఒక అద్దాల రైలు బోగీ ఉన్నప్పటికీ పర్యాటకుల(Tourists) నుంచి ఈ సీజన్‌లో  డిమాండ్‌ పెరిగింది.  దీంతో అరకు ట్రైన్‌కు అదనంగా రెండు విస్టోడోమ్‌ కోచ్(Vistadome Coach) లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీ గొడ్డేటి మాధవి, అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ రైల్వే ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read: Dussehra Special Trains: దసరా వేళ ప్రయాణీకుల రద్దీ, ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రత్యేక రైళ్లు


ట్రయల్ రన్ నిర్వహణ
గత ఏడాదే అదనంగా రెండు అద్దాల బోగీలు నడిపేందుకు రైల్వే శాఖ నిర్ణయించినప్పటికీ కోవిడ్‌ కారణంగా ఆలస్యమైంది. త్వరలో అందుబాటులోకి రానున్న రెండు అద్దాల బోగీలను మంగళవారం రైల్వే శాఖ అధికారులు ట్రయల్‌ రన్‌(Trail run) నిర్వహించారు. విశాఖ నుంచి అరకు లోయ రైల్వే స్టేషన్‌కు చేరుకున్న ఈ రెండు అద్దాల బోగీలు పర్యాటకులు, స్థానికులను ఆకర్షించాయి. వీటిలో  రైల్వే ఏడీఆర్‌ఎం ఎస్‌కే గుప్తా, ఇతర అధికారులు ప్రయాణించారు. 


త్వరలో అందుబాటులోకి రానున్న రెండు అద్దాల బోగీ(glass Coach)ల్లో 44 సీట్లతో పాటు, పూర్తిస్థాయిలో సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని రైల్వే ఏడీఆర్‌ఎం ఎస్‌కే గుప్తా తెలిపారు. స్థానిక రైల్వే స్టేషన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గతంలో ఉన్న విస్టో డోమ్‌ బోగీ కన్నా ఈ రెండు బోగీల్లో మరిన్ని సౌకర్యాలు ఉంటాయన్నారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook