Viveka Murder Case: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో కొత్త పరిణామం జరిగింది. ఈ కేసులో మొన్నటి వరకూ దర్యాప్తు అధికారిగా పనిచేసిన సీబీఐ ఎస్పీ రాంసింగ్, వివేకా కూతురు సునీతా రెడ్డి, అల్లురు రాజశేఖర్‌లపై కేసు నమోదు చేయాల్సిందిగా పులివెందుల కోర్టు ఆదేశించింది. ఈ కేసులో ఇది ఊహించని పరిణామం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అతని మాజీ పీఏ కృష్ణారెడ్డిని సీబీఐ తరచూ విచారణ పేరుతో వేధిస్తుండటంతో అతను పోలీసుల్ని ఆశ్రయించారు. ఇదే విషయమై పులివెందుల కోర్టును సైతం ఆశ్రయించాడు. దీనిపై విచారణ జరిపిన కోర్టు వివేకానందరెడ్డి కుమార్తె సునీతా రెడ్డి, అల్లుడు రాజశేఖర్‌తో పాటు సీబీఐ ఎస్పీ రాంసింగ్‌లపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. దాంతో పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో తనను బెదిరిస్తున్నారని, కొందరి నేతల పేర్లు చెప్పాలంటూ సీబీఐ అధికారులు ఒత్తిడి చేస్తున్నట్టుగా కృష్ణారెడ్డి కోర్టుకు విన్నవించాడు. వివేకా హత్య కేసులో కొందరు నాయకుల ప్రమేయం ఉందనేలా సాక్ష్యం చెప్పాలంటూ ఎస్పీ రాంసింగ్ వేధిస్తున్నారని పిటీషనర్ తెలిపాడు. అంతేకాకుండా సీబీఐ అధికారులకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని వివేకానందరెడ్డి కుమార్తె సునీతా రెడ్డి, అల్లుడు రాజశేఖర్‌లు ఒత్తిడి తెచ్చారని చెప్పాడు. అందుకే కోర్టును ఆశ్రయిస్తున్నట్టు చెప్పాడు.


కేసు విచారణ అనంతరం కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు వివేకా కుమార్తె సునీతా రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, సీబీఐ ఎస్పీ రాంసింగ్‌పై కేసు నమోదుకు కోర్టు ఆదేశించడంతో ఐపీసీ సెక్షన్ 156(3)  ప్రకారం పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు. 


Also read: Dawood Ibrahim: దావూద్ ఇబ్రహీంపై విష ప్రయోగం, కరాచీ ఆసుపత్రిలో చికిత్స, ఇంటర్నెట్ డౌన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook