Vizag nad Flyover Duke bike road Accident video Goes Viral: రోడ్డుపైన వెళ్లేటప్పుడు స్పీడ్ గా వెళ్లొద్దని పోలీసులు చెబుతుంటారు. ముఖ్యంగా ఫ్లైఓవర్లపై వెళ్లేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తుంటారు. కానీ కొందరు యువకులు మాత్రం ఇవేం పట్టించుకోరు. బండి దొరికిందటే చాలు ఇష్టమున్నట్లు నడిపిస్తుంటారు. త్రిబుల్ రైడింగ్ చేసుకుంటూ వెళ్తుంటారు. తాము ప్రమాదంలో పడటమేకాకుండా ఎదుటి వాళ్లను కూడా డెంజర్ లో పడేస్తుంటారు. హెల్మెట్ పెట్టుకోరు. కొంత మంది తప్పతాగి డ్రైవింగ్ చేస్తుంటారు. ఇలాంటి ఘటనల్లో సెకన్ల వ్యవధిలో ప్రాణాలు పోతుంటాయి. బైక్ మీద ఎక్కగానే కొందరు స్పీడ్ గా వాహానం నడిపిస్తుంటారు. స్పీడ్ బ్రేకర్ లను అస్సలు పట్టించుకోరు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



ముఖ్యంగా రింగ్ రోడ్ లు, ఫ్లై ఓవర్ల మీద యువత మరింతగా రెచ్చిపోతుంటారు. బైక్ రేసింగ్ లకు పాల్పడుతుంటారు.హైవేల మీద ఎంతో స్పీడ్ గా వెళ్లాలో, అంతకన్న వేగంగా వెళ్తు ఇష్టమున్నట్లు డ్రైవింగ్ చేస్తుంటారు. ఇలాంటి సందర్భాలలో కొన్నిసార్లు దారుణ ఘటనలు చోటు చేసుకుంటాయి. ప్రస్తుతం ఇలాంటి కోవకు చెందిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విశాఖ పట్నంలో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది.


 


పూర్తి వివరాలు..


విశాఖ పట్నంలోని ఎన్ఏడి ఫ్లైఓవర్ మీద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముగ్గురు యువకులు స్పీడ్ గా వచ్చి, ఫ్లైఓవర్ డివైడర్ ను బలంగా ఢీకొట్టారు.  ఎవరు కూడా హెల్మెట్ ధరించలేదు. డివైడర్ ను బలంగా డ్యూక్ వాహానం ఢీకొట్టడంతో, అవతలివైపుకు ఎగిరి పడ్డారు. దీంతో బైక్ ఒకవైపు, యువకులు ఫ్లై ఓవర్ పై నుంచి బంతిలాగా గాల్లో ఎగిరి కింద బంతిలాగ పడ్డారు. ఈ ఘటనలో సంఘటన స్థలంలోనే ఇద్దరు మృతిచెందగా.. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. పెద్దగా సౌండ్ రావడంతో చుట్టుపక్కల ఉన్న వారు అక్కడికి చేరుకున్నారు. అంబులెన్స్ కు కాల్ చేశారు. ముగ్గురిలో ఇద్దరు చనిపోయినట్లు సిబ్బంది తెలిపారు. తీవ్రంగా గాయపడిన మరోక యువకుడిని ఆస్పత్రికి తరలించారు. అతనికి కూడా తీవ్రంగా గాయలైనట్లు తెలుస్తోంది. ఈ ఘటన అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


Read more: Dice Snakes: ఆస్కార్ లెవల్ పర్ఫామెన్స్.. చచ్చిపోయినట్లు నటిస్తున్న పాములు.. కారణం ఏంటో తెలుసా..?


యువకులు అతి వేగం వల్లనే, ఈ ఘటన జరిగినట్లు స్పష్టంగా తెలుస్తోంది. పోలీసులు ఇప్పటికే ప్రతిరోజు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని చెబుతుంటారు.టూవీలర్స్ లు తప్పకుండా హెల్మెట్ ధరించాలి, వాహానం వెనక కూర్చున్న వారు కూడా హెల్మెట్ లు పెట్టుకొవాలని చెబుతుంటారు. ఇక.. మరోవైపు..కారులో ప్రయాణిస్తున్న వారు తప్పకుండా సీట్ బెల్ట్ పెట్టుకొవాలి. అదే విధంగా రాంగ్ రూట్లలో వెళ్లడం, అత్యధిక స్పీడ్ తో వాహనాలు డ్రైవింగ్ చేయడం వంటివి చేయోద్దని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తుంటారు. పోలీసులు ఎంతగా అవగాహాన కార్యక్రమాలు చేపట్టిన కూడా కొందరిలో ఇప్పటికి మార్పులు రావడం లేదు. ఏదైన ప్రమాదం జరగ్గానే అలర్ట్ అవుతారు.. ఆతర్వాత శరామాములే అన్నట్లు ఉంటారు. ఇలాంటి నెగ్లీజెన్సీతో ఉంటే ఊహించిన ఘటనలు జరుగుతాయిన పోలీసులు తరచుగా చెబుతుంటారు.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter