Vizag steel plant issue: విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై వివాదం ఆగనే లేదు. ఆందోళన కొనసాగుతోంది. మరోవైపు అదే స్టీల్‌ప్లాంట్ మిగులు భూముల్లో దక్షిణ కొరియాకు చెందిన కంపెనీ గ్రీన్‌ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నామని కేంద్రం స్పష్టం చేసింది. ఇది మరో వివాదానికి దారి తీయనుందా..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ( Vizag steel plant privatisation )పై ఆందోళన ఉధృతమవుతోంది. ఉద్యోగులు, కార్మిక సంఘాలకు తోడు అధికార పార్టీ కూడా ఆందోళనలో పాల్గొంటుంది. ఇప్పటికే ప్రైవేటీకరణకు వ్యతిరేకమని ముఖ్యమంత్రి జగన్ ( Ap cm ys jagan )స్పష్టం చేశారు. మరోవైపు రాజ్యసభలో ఇదే విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌కు సంబంధించిన మిగులు భూముల్లో దక్షిణ కొరియాకు చెందిన పోస్కో స్టీల్ కంపెనీ గ్రీన్‌ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఆసక్తి చూపించినట్టు కేంద్ర ఉక్కుశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ( Union steel minister Dharmendra prasad ) రాజ్యసభ ( Rajyasabha )లో స్పష్టం చేశారు. దీనికి సంబంధించి పోస్కో-ఆర్ఐఎన్ఎల్ మద్య 2019 అక్టోబర్‌లోనే ఎంవోయూ కుదిరినట్టు తెలిపారు. ఇందులో భాగంగా ఉభయపక్షాల మధ్య పరస్పర సమాచార మార్పిడి కోసం జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఏర్పడిందన్నారు. ప్లాంట్‌లో ఎవరి వాటా ఎంత ఉండాలనే అంశం ఇంకా ఖరారు కాలేదని..ఎంవోయూ ప్రకారం 50 శాతం వాటాను  పోస్కో కంపెనీ ( Posco company ) కోరుతుందని తెలిపారు. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ వాటా ఎంత ఉండాలనేది కేటాయించే భూముల విలువపై ఆధారపడి ఉంటుందని కేంద్ర మంత్రి వివరించారు.  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి ( Vijaya sai reddy )అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. 


మరోవైపు విజయవాడ సమీపంలోని కొండపల్లి నుంచి తిరుపతి వరకూ 450 కిలోమీటర్ల మేర గ్యాస్ పైప్‌లైన్ ఏర్పాటుకు గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా గెయిల్ ( GAIL ) ఆసక్తి కనబర్చిందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. ఈ పైప్‌లైన్ నిర్మాణం ద్వారా సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ మరింతగా పటిష్టమవుతుందని గ్యాస్ నిత్యం అందుబాటులో ఉంటుందని మంత్రి వివరించారు. దీనికి సంబంధించిన ప్రతిపాదననల్ని గెయిల్ ఇప్పటికే పంపిందన్నారు. అదే విధంగా ఏపీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, గెయిల్ సంయక్తంగా చేపట్టిన కాకినాడ-విశాఖపట్నం-శ్రీకాకుళం గ్యాస్ పైప్‌లైన్, శ్రీకాకుళం-అంగుల్ గ్యాస్ పైప్‌లైన్ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయన్నారు. 


Also read: Vizag steel plant: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఆందోళన


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదంరాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook