Vizianagaram Train Accident: విజయనగరం రైలు ప్రమాదంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితుల్ని పరామర్శించేందుకు ఇవాళ నేరుగా విజయనగరం చేరుకున్నారు. విజయవాడ నుంచి విశాఖపట్నంకు ప్రత్యేక విమానం ద్వారా, అక్కడ్నించి విజయనగరం చాపర్ ద్వారా వచ్చారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటి వరకూ 14 మంది మరణించగా 100 మందికి పైగా గాయాలయ్యాయి. ప్రమాదం గురించి తెలియగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం పూర్తిగా అందించాలని సంబంధిత అధికారుల్ని ఆదేశించి సహాయక చర్యల్ని వేగవంతం చేశారు. మరణించినవారికి 10 లక్షల రూపాయలు, గాయపడినవారికి  2 లక్షల రూపాయలు పరిహారం ప్రకటించారు. ఇవాళ నేరుగా విజయనగరం చేరుకుని బాధిత కుటుంబాల్ని పరామర్శించారు. ముందుగా చనిపోయిన వారి చిత్రపటాలకు ముఖ్యమంత్రి జగన్ నివాళులు అర్పించారు. 


వాస్తవానికి ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ముఖ్యమంత్రి జగన్ రైలు ప్రమాద ఘటనా స్థలాన్ని కూడా సందర్శించాల్సి ఉంది. కానీ ముఖ్యమంత్రి అక్కడికి వస్తే ప్రోటోకాల్ ఇబ్బందులు, సహాయక చర్యలు ఆలస్యం కావచ్చన్న రైల్వే అధికారుల విజ్ఞప్తితో పర్యటనలో మార్పులు చేశారు. నేరుగా బాధితుల్ని పరామర్శించారు. ప్రమాదం ఎలా జరిగిందనేది బాధితుల్ని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో వైద్యం ఎలా అందుతుందో క్షతగాత్రుల్ని అడిగారు. 


విజయనగరం జిల్లా కంటకాపల్లి వల్ల మద్యలో ఉన్న ట్రాక్‌పై విశాఖ-పలాస పాసెంజర్ రైలు నెమ్మదిగా వెళ్తోంది. అదే ట్రాక్ పై వెనుక వైపు నుంచి విశాఖ-రాయగఢ్ రైలు వేగంగా వచ్చి ఢీకొట్టింది. దాంతో రెండు రైళ్లకు సంబంధించి 7 భోగీలు దెబ్బతిన్నాయి. మూడు భోగీలు పూర్తిగా నుజ్జునుజ్జయ్యాయి. విశాఖపట్నం నుంచి భారీ క్రేన్లు తీసుకొచ్చి భోగీల్ని తొలగిస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికన ట్రాక్ పునరుద్ధరించే పనులు చేస్తున్నారు. మరోవైపు విజయనగరం రైలు ప్రమాదంపై అత్యున్నత స్థాయిలో విచారణ ప్రారంభమైంది. 


Also read: Vizianagaram Train Accident News: విజయనగరం రైలు ప్రమాదం లైవ్ అప్‌డేట్స్.. అసలు ఏం జరిగిందంటే..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook