Contaminated Water issue at Bezawada: విజయవాడలో ప్రజలు తాగునీరు కలుషితమైన సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా గత పదిరోజుల నుంచి ఈ సమస్య మరీ ఎక్కువగా ఉందని స్థానికులు వాపోతున్నారు. అనేక ప్రాంతాలలో మ్యాన్ హోళ్లు  నిండిపోయి పొంగి పొర్లుతున్నాయని తెలుస్తోంది. ఇక మ్యాన్ హోళ్లలోని నీరు, అనేక చోట్ల నల్లాల పైపులతో కలసి పోయి, నీరు కలుషితమైపోతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనేక చోట్ల నల్లాలను సప్లై చేసే పైపులు లీకేజీలు ఉన్నాయని అంటున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read more: Snake: వామ్మో.. ఫ్యాన్ మీద ప్రత్యక్షమైన భయంకరమైన పాము.. వైరల్ గా మారిన షాకింగ్ వీడియో..


ఇదిలా ఉండగా.. గత పది రోజుల వ్యవధిలో మొగల్రాజపురంలోని ప్రజలు కలుషిత నీటి ప్రభావానికి గురయ్యారు. ఇప్పటికే అనేక మంది వాంతులు, విరేచనాలతో ఆస్పత్రుల చుట్టు తిరుగుతున్నారు. ఇప్పిటికే కలుషిత నీరుతాగి వాంతులు, విరేచనాలతో ఇద్దరు చనిపోయినట్లు తెలుస్తోంది. స్థానికంగా ఉండే వల్లూరు దుర్గారావు గత ఆదివారం నుంచి వాంతులు, విరేనానాలతో బాధపడుతున్నాడు.ఈ నేపథ్యంలో ఆయనను ఆస్పత్రికి తరించారు ఆయనకు టెస్టులు చేసిన వైద్యులు, ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. 


కానీ అప్పటికే ఆయన చనిపోయినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. ఇలానే మరోకరు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఎంతగా చెప్పాన కూడా ఎవరు పట్టించుకోవడంలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక వైపు ప్రజలు ఆస్పత్రులలో జాయిన్ అవుతున్నారు. విజయవాడ మున్సిపాల్ సిబ్బంది అస్సలు పట్టించుకోవడంలేదని స్థానికులు మీడియాల ఎదుట తమ ఆవేదనవ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ చూసిన కూడా మ్యాన్ హోళ్లు పొండిపోర్లుతున్నాయి. నాలాలలో నీరు ఎక్కడికక్కడ జామ్ అయిపోయి రోడ్లమీదకు వస్తున్నాయి .  నాలాల్లో పందులు, కుక్కలు సంచరిస్తున్నాయి.


Read more: Fahadh Faasil: పుష్ప 2 విలన్ కు అరుదైన వ్యాధి.. ఆందోళనలో ఫ్యాన్స్.. దీని లక్షణాలు ఇవే..


వీటి వల్ల మనుషులు ఇంకా భయంకరమైన వ్యాధులకు గురయ్యే అవకాశం ఉందని కూడా స్థానికులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా.. తమ ఏరియాలోని ప్రజలంతా నాళాల నుంచి సరఫరా అయ్యే కుళాయి నీళ్లను తాగుతుంటామని , దీని వల్లనే అనారోగ్యసమస్యలు వచ్చాయని కూడా బాధితులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. దీనిపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, తగిన చర్యలు తీసుకొవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు . ఇక దీనిపై మున్సిపాల్ అధికారులు తమ చర్యలను ప్రారంభించినట్లు తెలుస్తోంది. వాటర్ లీకేజీలు, నాలాలలో పూడిక తీయడం వంటి పనులను ప్రారంభించినట్లు సమాచారం.



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter