Fahadh Faasil: పుష్ప 2 విలన్ కు అరుదైన వ్యాధి.. ఆందోళనలో ఫ్యాన్స్.. దీని లక్షణాలు ఇవే..

Pushpa 2 villain: పుష్ప సినిమా విలన్ అత్యంత అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఆయన ఇటీవల ఏడీహెచ్డీ ప్రభావానికి గురైనట్లు వెల్లడించారు. దీని వల్ల శరీరంలో అనేక రకాల ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పారు. 

  • May 28, 2024, 16:25 PM IST
1 /6

స్టైలీష్ స్టార్  అల్లుఅర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించిన పుష్ప మూవీ ఏ రెంజ్ లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ సినిమా మొత్తం ఒక ఎత్తైతే.. చివరలో ఫారెస్టు ఆఫీసర్ నటించిన భన్వార్ సింగ్ షెకావాత్ సీన్ లు మరో ఎత్తు అని చెప్పుకొచ్చు.

2 /6

తననటనతో చివరి 20 నిముషాలు ఆడియన్స్ ను తనవైపు తిప్పుకున్నాడు మలయాళ నటుడు ఫాహాద్ ఫాజిల్. ప్రస్తుతం పుష్ప మూవీ 2 మేకింగ్ నడుస్తోంది. ఇదిలా ఉండగా.. దీనిలో విలన్ గా  చేసిన మలయాళ నటుడు ఫాహద్ అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పారు.

3 /6

కొన్నిరోజులుగా తాను.. ఏడీ హెచ్డీ సమస్యతో బాధపడుతున్నానని, దీని వల్ల మెదడు పనితీరు పై చాలా ప్రభావం ఉంటుందని కూడా ఫాహాద్ వెల్లడించాడు. దీంతో ఆయన అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏడీహెచ్‌డీ అంటే.. అటెన్షన్ డెఫిషిట్ హైపరాక్టివిటీ డిజార్డర్. 41 ఏళ్ల వయస్సులో ఈ వ్యాధితో ప్రస్తుతం ఫాహాద్ సఫర్ అవుతున్నారు. 

4 /6

దీని వల్ల దేని మీద ఎక్కువ సేపు వర్క్ మీద కాన్సట్రెషన్ చేయలేకపోవడం, తొందరగా కోప్పడటం లాంటి సమస్యలు వస్తాయంట. ఇలాంటి లక్షణాలను గుర్తించి తాను వైద్యుడిని సంప్రదిస్తే తన సమస్య బయటపడినట్లు ఫాహద్ తెలిపాడు. 

5 /6

ఒక టీవీ కార్యక్రమంలో ఫాహద్ ఈ విషయాన్ని తెలిపారు. దీనికి ఎలాంటి చికిత్స అవసరం అనే విషయమై వైద్యులతో మాట్లాడుతున్నట్లు ఫాహద్ చెప్పాడు. ఇప్పటికైతే ఆరోగ్యంగానే ఉన్నానని చెప్పారు. 

6 /6

ఇదిలా ఉండగా.. ఒక వ్యక్తికి ఏడీహెచ్‌డీ ఎందుకు వస్తుందో చెప్పడానికి ఖచ్చితమైన కారణాలు ఏమిలేవని వైద్యులు చెప్తున్నారు. ప్రస్తుతం దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ సమస్యలతో బాధ పడే వారికి కొన్నిరకాల ట్రీట్మెంట్ లు ఇస్తారని, వీటితో వ్యాధి నుంచికోలుకోవచ్చని కూడా వైద్యులు చెబుతున్నారు.