Cold Wave in Andhra Pradesh and Telangana: తెలుగు రాష్ట్రాల ప్రజలను చలి పులి చంపేస్తోంది. కొద్ది రోజులగా ఏపీ, తెలంగాణల్లో చలి తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి.ముఖ్యంగా మన్యం వాసులు చలి తీవ్రతకు గజ గజ వణుకుతున్నారు. ఇంటి నుంచి బయటకు రావాలంటే ప్రజలు భయపడుతున్నారు. కొన్ని ప్రాంతాలైతే ఉదయం పది గంటలైనా సరే పొగమంచు తగ్గడం లేదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్ లో...
ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. గత రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. సోమవారం లంబసింగి, చింతపల్లి, జి.మాడుగులలో 2, హుకుంపేట 2.3, గూడెంకొత్తవీధి 2.6, అరకులోయ 3.2, పాడేరు 3.6, మినుములూరు కాఫీ బోర్డు వద్ద 6, అనంతగిరి 8.6, కొయ్యూరులో 9.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 9 గంటలైనా మంచు తెరలు వీడకపోవడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. చలి ప్రభావం ఎక్కువగా ఉండటంతో వ్యవసాయ కూలీలు పనులకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఈ చలికి చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా చోట్ల మధ్యాహ్నం 3 గంటల నుంచే చలి గాలుల ప్రభావం కనిపిస్తోంది. 


తెలంగాణలో..
ఉష్ణోగ్రతలు పడిపోతున్న నేపథ్యంలో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో అరెంజ్ అలర్ట్ కూడా కొనసాగింది. సోమవారం కామారెడ్డి జిల్లా డొంగ్లీ ప్రాంతంలో 5.5 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్ జిల్లాలో కూడా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పడిపోతున్నాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సంగారెడ్డి, నిర్మల్, సిద్దిపేట, కొమురం భీం జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో 5 రోజుల వరకు ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. 


Also Read: Saturn Transit 2023: త్వరలో శని నక్షత్రం మార్పు.. ఈ మూడు రాశులకు డబ్బే డబ్బు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U      


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.