ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ( Ap High court ) వర్సెస్ ప్రభుత్వం ( Government ) మధ్య నడుస్తున్న సంఘర్షణ తారాస్థాయికి చేరుతోందా? సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ బాబ్డే ( Supreme court CJI SA Bobde ) కు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాసిన లేఖలో అసలేముంది?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య సంఘర్షణనే నడుస్తోంది. ప్రభుత్వం తీసుకుంటున్న వివిధ చర్యలపై స్టే విధించడమే కాకుండా..సీఐడీ దర్యాప్తును కూడా ఇటీవల హైకోర్టు అడ్డుకోవడం వివాదాస్పదమైంది. దేశమంతా చర్చనీయాంశమైంది. శాసనవ్యవస్థలో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకుంటోందని వైసీపీ ఎంపీలు పార్లమెంట్ సాక్షిగా గళమెత్తారు. 


ఇప్పుడు కొత్తగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ( Ap cm ys jagan ) సుప్రీంకోర్టు జస్టిస్ ఎన్వీ రమణ ( Supreme court justice N V Ramana ) పై సంచలన ఆరోపణలు చేయడం వివాదం పరాకాష్ఠకు చేరిందనడానికి నిదర్శనంగా నిలుస్తోంది. సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్న ఎన్వీ రమణ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ( Ap High court )ను ప్రభావితం చేస్తున్నారని సీఎం జగన్ ఆరోపించారు. హైకోర్టు రోస్టర్‌ను కూడా ప్రభావితం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు జస్టీస్ ఎన్వీ రమణ, చంద్రబాబులపై , హైకోర్టుకు సంబంధించిన వ్యవహారంపై సీఎం వైఎస్ జగన్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ శరత్ అరవింద్ బాబ్డేకు 8 పేజల లేఖను రాశారు. ఏపీ హైకోర్టు కూడా పక్షపాత వైఖరితో వ్యవహరిస్తోందని ఆ లేఖలో సీఎం జగన్ ఆరోపించారు. అక్టోబర్ 6వ తేదీన రాసిన ఈ లేఖ ఇప్పుడు బయటకు రావడంతో సంచలనం రేగుతోంది. Also read: Good news for Teachers: బదిలీలకు గ్రీన్ సిగ్నల్, రెండ్రోజుల్లో ఉత్తర్వులు