పోలవరం ప్రాజెక్టు ( Polavaram project ) నిర్మాణంపై ఏపీ ప్రభుత్వం ( Ap Government ) స్పందించింది. నిధుల విడుదల విషయంలో జోక్యం చేసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) ..ప్రధాని మోదీకు లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టు స్టేటస్ ను రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మీడియాకు వివరించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఆంధ్రప్రదేశ్ జీవనరేఖ ( Ap life line ) పోలవరం ప్రాజెక్టు విషయంలో ఇటీవల వివాదం చోటుచేసుకుంది. ప్రాజెక్టు అంచనా వ్యయం, పునరావానికి సంబంధించి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్యన ప్రతిష్ఠంభన నెలకొంది. గత ప్రభుత్వ తప్పిదమే దీనికి కారణంగా ఇటు అధికారపార్టీ, అటు బీజేపీ ( BJP )  కూడా స్పష్టం చేసిన పరిస్థితి. ఈ నేపధ్యంలో పోలవరం ప్రాజెక్టు పరిస్థితిపై రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ( Ap Irrigation minister anil kumar yadav ) మీడియాకు వివరించారు.


పోలవరం ప్రాజెక్టు నిర్మించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని ( Central Government ) ..పునరావాసం కూడా కేంద్ర ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ఇదే విషయంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్..ప్రధాని నరేంద్రమోదీ ( pm narendra modi ) కు లేఖ రాశారన్నారు. నిధుల విడుదల విషయంలో జోక్యం చేసుకోవాలని ఆ లేఖలో కోరారన్నారు. ఏపీ పునర్విభజన చట్టంలో పొందుపర్చినదాని ప్రకారం పోలవరం ప్రాజెక్టును కేంద్రమే నిర్మించాల్సి ఉందన్నారు. ఇరిగేషన్‌, భూ సేకరణ, పునరావాసానికి కేంద్రం నిధులివ్వాలని..ఆలస్యమయ్యే కొద్దీ ప్రాజెక్ట్‌ వ్యయం పెరుగుతోందని తెలిపారు. Also read: ANGRAU Admissions 2020: ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం అడ్మిషన్ నోటిఫికేషన్


వాస్తవానికి పోలవరంపై జరిగిన అన్యాయానికి కారణం పూర్తిగా గత ప్రభుత్వమేనన్నారు. 2014లో పోలవరంను కేంద్ర ప్రాజెక్టుగా ప్రారంభిస్తే..2016 సెప్టెంబర్ వరకూ నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ( ex cm chandrababu naidu ) పట్టించుకోలేదని చెప్పారు. మారిన అంచనా ప్రతిపాదనల్ని అడిగినా టీడీపీ ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. 2016లో ప్యాకేజ్ ఒప్పందం చేసుకున్నారని గుర్తు చేశారు. ఈ ఒప్పందంలో నూటికి నూరుశాతం ఇరిగేషన్ కు నిధులిస్తామని కేంద్రం చెప్పిందని తెలిపారు.


2017 మార్చ్ 15న కేంద్ర కేబినెట్ తీర్మానం చేసి..2014 తరువాత పెరిగే అంచనాల్ని చెల్లించమని చెప్పిన సంగతిని..ఆ తీర్మానాన్ని టీడీపీ కేంద్రమంత్రులు అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి ఆమోదించిన సంగతిని మంత్రి అనిల్ కుమార్ గుర్తు చేశారు. ఈ తీర్మానం ప్రకారం 2010 వరక సేకరించినదానికే చెల్లిస్తామని కేంద్రం చెప్పిందన్నారు. ఆ రోజు చంద్రబాబు ఈ విషయాల్ని ఎందుకు ఒప్పుకున్నారని ప్రశ్నించారు. అటు కేబినెట్ తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రశంసిస్తూ తీర్మానం కూడా చేసిన సంగతిని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గుర్తు చేశారు. 


నాడు చంద్రబాబు చేసిన పెద్దతప్పు వల్లే ఇవాళ ఈ సమస్య తలెత్తిందన్నారు. అయితే ఇప్పుడు పోలవరంపై రాద్ధాంతం చేసిన రాస్తున్న పత్రికలకు ఆనాడు ఇదంతా ఎందుకు కన్పించలేదన్నారు. నాడు చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పును నేడు ఆ పత్రికలు ఎందుకు రాయడం లేదని అడిగారు. వీటిని సరిదిద్దడానికే సీఎం జగన్..ప్రధానికి లేఖ రాసినట్టు చెప్పారు. 2021 డిసెంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. Also read: AP Ration Cards : 35 రోజుల్లోనే 6 లక్షల రేషన్ కార్డులు జారీ చేసిన ఏపి ప్రభుత్వం


మరిన్ని వివరాలు, వివిధ కోర్సుల జాబితా కోసం యూవిర్సిటీ అధికారిక పోర్టల్ angrau.ac.in  విజిట్ చేయండి.


A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR