Pawan Kalyan: అక్కడ మోడీ.. ఇక్కడ పవన్! ప్రధాని పర్యటనకు జనసేనాని డుమ్మా అందుకేనా?
Pawan Kalyan: బీజేపీ-జనసేన మిత్రపక్షాలు. బీజేపీ అగ్రనేత ప్రధాని నరేంద్ర మోడీ భీమవరం వచ్చారు. భీమవరం పవన్ కల్యాణ్ సొంత జిల్లాలో ఉంది. తనకు అధికారికంగా కేంద్ర సర్కార్ నుంచి ఆహ్వానం ఉన్నా పవన్ కల్యాణ్ హాజరుకాకపోవడం అందరిని అశ్చర్యపరుస్తోంది.
Pawan Kalyan: జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో సెంటర్ అఫ్ అట్రాక్షన్ గా ఉన్నారు. జనసేన పార్టీ ప్రస్తుతం బీజేపీకి మిత్రపక్షంగా ఉంది. బీజేపీ పెద్దలతోనూ పవన్ కు మంచి సంబంధాలు ఉన్నాయి. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ లో పర్యటించారు. భీమవరంలో నిర్వహించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ఈ వేడుక నిర్వహించింది. ప్రధాని మోడీ పర్యటనలో పాల్గొనాల్సిందిగా జనసేన చీఫ్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆహ్వానం పంపారు. కాని పవన్ కల్యాణ్ ఈ వేడుకకు హాజరుకాలేదు.
బీజేపీ-జనసేన మిత్రపక్షాలు. బీజేపీ అగ్రనేత ప్రధాని నరేంద్ర మోడీ భీమవరం వచ్చారు. భీమవరం పవన్ కల్యాణ్ సొంత జిల్లాలో ఉంది. అంతేకాదు గత ఎన్నికల్లో భీమవరం నుంచి అసెంబ్లీకి పవన్ కల్యాణ్ పోటీ చేశారు. భీమవరంతో పవన్ కు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అలాంటి భీమవరానికి ప్రధాని మోడీ వస్తున్నా.. తనకు అధికారికంగా కేంద్ర సర్కార్ నుంచి ఆహ్వానం ఉన్నా పవన్ కల్యాణ్ హాజరుకాకపోవడం అందరిని అశ్చర్యపరుస్తోంది. జనసేన తరపున ప్రతినిధిని మోడీ సభకు పంపించారు. ఇదే ఇప్పుడు ఏపీలో చర్చగా మారింది.
పవన్ భీమవరం రాకపోవడమే కాదు రెండు, మూడు రోజులుగా ఆసక్తికర పరిణామాలు జరిగాయి. జూలై 2,3 తేదీల్లో హైదరాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగాయి. పార్టీ సమావేశాల కోసంవచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ.. శని, ఆదివారాలు భాగ్యనగరంలో ఉన్నారు. అయితే ఆ సమయంలో పవన్ కల్యాణ్ ఏపీలో పర్యటించారు. కృష్ణా జిల్లాలో నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అల్లూరి జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు సోమవారం ప్రధాని నరేంద్ర మోడీ ఏపీకి వచ్చారు. అది కూడా పవన్ కల్యాణ్ సొంతగడ్డ భీమవరం వచ్చారు. కాని జనసేన చీఫ్ మాత్రం ఏపీ నుంచి హైదరాబాద్ వెళ్లారు. ప్రధాని హైదరాబాద్ లో ఉండగా ఏపీలో ఉన్న పవన్... మోడీ ఏపీకి రాగానే హైదరాబాద్ వెళ్లడం ఆసక్తి రేపుతోంది. పవన్ కల్యాణ్ తీరుపై సోషల్ మీడియాతో ఇంట్రెస్టింగ్ చర్చ సాగుతోంది. అక్కడ మోడీ.. ఇక్కడ పవన్ అంటూ కొందరు పోస్టులుపెడుతున్నారు. అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి పవన్ తొలి సినిమా. ఆ సినిమా టైటిల్ తో పోల్చూతూ పవన్ కల్యాణ్ తాజా పరిణామాలపై సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు.
ప్రధాని మోడీ భీమవరం పర్యటనకు పవన్ కల్యామ్ డుమ్మా కొట్టడంపై పలు రకాల వాదనలు వస్తున్నాయి. అల్లూరి జయంతి వేడుకల్లో ప్రధాని మోడీతో పాటు ఏపీ సీఎం జగన్ పాల్గొన్నారు. ఇదే పవన్ రాకపోవడానికి ప్రధాన కారణమని అంటున్నారు. జగన్ తో కలిసి వేదిక పంచుకోవడం ఇష్టం లేకనే మోడీ టూర్ కు జనసేన చీఫ్ దూరంగా ఉన్నారని తెలుస్తోంది. ఇటీవల కాలంలో సీఎం జగన్ టార్గెట్ గా తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు పవన్. అటు వైసీపీ కూడా చంద్రబాబు దత్తపత్రుడు అంటూ పవన్ కు కౌంటరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం జగన్ తో కలిసి వేదిక పంచుకుంటే జనాల్లోకి తప్పుడు సంకేతాలు వస్తాయనే భావనతోనే పవన్ కల్యాణ్ ప్రధాని పర్యటనకు హాజరుకాలేదని జనసేన వర్గాలు చెబుతున్నాయి.
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook