MP Raghurama Raju: అరెస్ట్ భయంతో భీమవరం వెళ్లని ఎంపీ రఘురామ.. ప్రధాని సభకు డుమ్మా! వైసీపీ దెబ్బ మాములుగా లేదుగా..

MP Raghurama Raju: రెండున్నర ఏళ్ల తర్వాత సొంత గడ్డపై అడుగుపెట్టాలనుకున్న నర్సాపురం వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు.. ఆ కల తీరేలా కనిపించడం లేదు.భీమవరం వెళ్లేందుకు తన అనుచరులతో కలిసి హైదరాబాద్ నుంచి నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ లో బయలుదేరిన ఎంపీ రఘురామ బేగంపేట ఎయిర్ పోర్టులోనే దిగిపోయారు.

Written by - Srisailam | Last Updated : Jul 4, 2022, 07:08 AM IST
  • భీమవరం వెళ్లిన ఎంపీ రఘురామ రాజు
  • అరెస్ట్ భయంతో మధ్యలోనే రైలు దిగిన ఎంపీ
  • ప్రధాని మోడీ సభకు రఘురామ దూరం
MP Raghurama Raju: అరెస్ట్ భయంతో భీమవరం వెళ్లని ఎంపీ రఘురామ.. ప్రధాని సభకు డుమ్మా! వైసీపీ దెబ్బ మాములుగా లేదుగా..

MP Raghurama Raju: రెండున్నర ఏళ్ల తర్వాత సొంత గడ్డపై అడుగుపెట్టాలనుకున్న నర్సాపురం వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు.. ఆ కల తీరేలా కనిపించడం లేదు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ సోమవారం భీమవరంలో పర్యటిస్తున్నారు. విప్లవవీరుకు అల్లూరు సీతారామారాజు 125వ జయంతోత్సవాలకు హాజరుకానున్నారు. భీమవరంలో ఏర్పాటు చేసిన 30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరిస్తారు. తర్వాత అక్కడే జరనగున్న సభలో పాల్గొంటారు. రాజకీయాలకు అతీతంతా కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న అల్లూరి జయంతోత్సవాల్లో ప్రధాని మోడీతో కలిసి సీఎం వైఎస్ జగన్ పాల్గొననున్నారు. ప్రోటోకాల్ ప్రకారం స్థానిక ఎంపీగా ఉన్న రఘురామ కృష్ణం రాజుకు పాల్గొనాల్సి ఉంది. ప్రధాని మోడీ పర్యటనలో పాల్గొనాలని ఎంపీ కూడా భావించారు. భీమవరం వెళ్లేందుకు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు.

భీమవరం వెళ్లేందుకు తన అనుచరులతో కలిసి హైదరాబాద్ నుంచి నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ లో బయలుదేరిన ఎంపీ రఘురామ కృష్ణం రాజు అనూహ్యంగా బేగంపేట ఎయిర్ పోర్టులోనే దిగిపోయారు.లింగంపల్లిలో  రైలు ఎక్కిన రఘురామ కాసేపటికే  బేగంపేట రైల్వే స్టేషన్ లో రైలు దిగారు. రైల్వే స్టేషన్ నుంచి పరుగులు పెడుతూ బయటికి వచ్చిన రఘురామ.. తన కారులో ఇంటికి వెళ్లిపోయారు.రైలు దిగిపోయిన రఘురామకృష్ణరాజు బృందం. భీమవరం వెళుతున్న రఘురామకృష్ణం రాజును నర్సాపూర్ ట్రైన్ లో ఏపీ నిఘా పోలీసులు అనుసరించారు. అటు భీమవరంలోనూ కొందరు రఘురామ అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. రఘురామరాజుకు అనుకూలంగా భీమవరంలో ర్యాలీ చేసిన యువకులను పోలీసులు అదుపులోనికి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో తనను కూడా అరెస్ట్ చేస్తారనే భయంతోనే రఘురామ కృష్ణం రాజు భీమవరం పర్యటన రద్దు చేసుకున్నారని చెబుతున్నారు.

ప్రధాని మోడీ పర్యటనలో సీఎం జగన్ తో పాటు ఎంపీ రఘురామ పాల్గొంటారన్న వార్త ఏపీలో కొన్ని రోజులుగా చర్చగా మారింది. కొంత కాలంగా సీఎం జగన్ ను తీవ్ర స్థాయిలో టార్గెట్ చేస్తున్న రఘురామ.. జగన్ తో వేదిక పంచుకుంటే ఎలా ఉంటోదనన్న ఆసక్తి జనాల్లోనూ కనిపించింది. అదే సమయంలో భీమవరం సభకు ఎంపీ రఘురామ వస్తారా లేదా అన్న అనుమానాలు వచ్చాయి. ఎంపీ రఘురామ భీమవరం రాకుండా వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారనే చర్చ  సాగింది. భీమవరం వెళితే పోలీసులు అరెస్ట్ చేస్తారని భావించిన ఎంపీ రఘురామ హైకోర్టును కూడా ఆశ్రయించారు.తనకు రక్షణ కల్పించాలని కోరారు. భీమవరం వెళితే తనను ఏపీ పోలీసులు అరెస్ట్ చేయాలని చూస్తున్నారని కోర్టుకు తెలిపారు. రఘురామ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. ఆయనకు రక్షణ కల్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. నర్సాపురం పర్యటనలో రఘురామపై ఎలాంటి చర్యలు తీసుకోవడానికి వీల్లేదని స్పష్టం చేసింది. కొత్త కేసులు పెట్టినా వెంటనే అరెస్టు చేయడానికి వీల్లేదని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో భీమవరం వెళ్లాలని భావించిన రఘురామ.. మధ్యలోనే రైలు దిగిపోవడం చర్చగా మారింది.

Read also: PM Modi: పోరు గడ్డ నుంచి రూట్‌ మార్చిన పీఎం మోదీ..రాజకీయాలు లేకుండా ప్రసంగం..!

Read also: Actress Arrested: రెచ్చిపోయి పోలీసాఫీసర్ ను కరిచిన నటి.. అసలు ఏమైందంటే?!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News