Andhra Pradesh: బాబోయ్.. కట్టుకున్న భర్తను నడి రోడ్డు మీద ఉరివేసి చంపిన భార్య.. ఎందుకో తెలుసా..?
Bapatla news: రోడ్డు మీద మహిళ రెచ్చిపోయింది. తన భర్తను కర్రతో కొడుతూ రచ్చ రచ్చ చేసింది. అంతేకాకుండా.. తాడును బిగించి మరీ హత్య చేసింది. ఈ ఘటన ప్రస్తుతం ఏపీలో పెనుదుమారంగా మారింది.
wife brutally attacks on husband in bapatla guntur: సాధారణంగా ఇప్పటి వరకు భర్తలు భార్యల్ని వేధింపులకు గురిచేసి, హత్యలు చేసిన ఘటనలు తరచుగా మనం వార్తలలో చూశాం. కానీ ఇటీవల మాత్రం.. దేశంలో అనేక షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. భర్తలను టార్చర్ పెడుతున్న భార్యల ఘటనలు కూడా ఇటీవల ఎక్కువగా సంచలనంగా మారుతున్నాయి.
అంతేకాకుండా.. కొన్ని రోజులు క్రితం అతుల్ తాజాగా.. ఢిల్లీలో పునీత్ అనే వ్యక్తి సైతం.. భార్యల వేధింపులు తాళలేక వీడియో రిలీజ్ చేసి మరీ ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ క్రమంలో.. ప్రస్తుతం ఏపీలో మాత్రం షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. బాపట్లలోని కొత్త పాలెంలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
కొత్తపాలెంకు చెందిన అరుణ.. గోకర్ణమఠంకు చెందిన అమరేంద్రబాబుకు పదేళ్ల క్రితం వివాహం అయింది. ఈక్రమంలో కొన్నిరోజులుగా అమరేంద్రబాబు మద్యానికి బానిసైనట్లు తెలుస్తొంది. ప్రతిరోజు కూడా ఇంట్లో గొడవలకు దిగేవాడంట. దీంతో భర్త వేధింపులు తాళలేక.. అరుణ అనే మహిళ తన భర్తపైన శివాలెత్తిపోయింది. ఏకంగా నడి రోడ్డుమీద భర్తను కర్రతో కొట్టి, ఉరివేసి హతమార్చినట్లు తెలుస్తొంది.
Read more: Tirumala: తిరుమలలో మళ్లీ అదే అపచారం.. టీటీడీపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తున్న శ్రీవారి భక్తులు..
ఈ ఘటన డిసెంబరు 31న రాత్రి చోటు చేసుకున్నట్లు తెలుస్తొంది. పుట్టింటికి వెళ్లిపోయిన భార్యను..అక్కడికి కూడా వెళ్లి వేధించడంతో.. భర్తపైన సదరు మహిళ ఈ విధంగా రివేంజ్ తీర్చుకున్నట్లు తెలుస్తొంది. ఈ ఘటన ప్రస్తుతం ఏపీలో సంచలనంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter