ఫొని తుపాను ముంచుకొస్తున్న నేపథ్యంలో  విశాఖలో బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి.  గంటలకు 50 కి.మీ వీస్తున్న ఈదురు గాలులకు పలు చోట్ల రోడ్లపై  చెట్లు, హోర్డింగలు విరిగిపడ్డాయి. పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో పాటు  చిరు జల్లులు పడుతున్నాయి. మరోవైపు సుముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. ఆర్కే బీచ్, రుషికొండ బీచ్, యారడ్ బీచ్ లలో  సముద్రం ముందుకు వచ్చి భయానక వాతావరణం కనిపిస్తోంది.


వాతావరణశాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం ఫొని తుపాను ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళఖాతంలో కొనసాగుతోంది. గంటకు 12.కి.మీ వేగంతో కదులుతున్న తుపాను విశాఖకు దక్షిణ ఆగ్రేయ దిశగా 260 కి.మీ దూరం.. ఒడిషాకు దక్షిణ నైరుతి దిశగా  510 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది.  రేపు మధ్యాహ్నం గోపాల్ పూర్ - దాంద్ బలి వద్ద తీరం దాటే అవకాశం ఉంది.