AP Liquor Shops Closed: మద్యం అమ్మకాలు ఎండకాలం జోరుగా సాగుతుంటాయి. మండే ఎండకాలం చల్లని బీర్లు తాగుతూ చిల్లవుతుంటారు. ఇప్పటికే మద్యం దుకాణాల్లో బీర్లు లేక విలవిల్లాడుతున్న మందుబాబులకు మరో షాక్. ఏపీలో మూడురోజుల పాటు మద్యం విక్రయాలను నిషేధించింది. ఆ వివరాలు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


మద్యం అమ్మకాలు రాష్ట్రంలో మూడు రోజులపాటు నిలిచిపోనున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్‌లో మద్యం విక్రయాలు మూడు రోజులపాటు నిషేధించాలని ఆదేశించింది. జూన్‌, 3, 4, 5 తేదీల్లో మద్యం విక్రయాలు నిలిచిపోనున్నాయి. జూన్‌ 4 ఏపీ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం, సోమవారం, మంగళవారం మూడు రోజులపాటు మద్యం విక్రయించడం నిషేధించనున్నట్లు డీజీపీ హరీష్‌ గుప్తా వెల్లడించారు. ఏపీ ఎన్నికలు మే 13న జరిగిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా నాలుగో విడత ఎన్నికలు ఆరోజు నిర్వహించారు. తెలంగాణాలో కూడా లోక్‌ సభ ఎన్నికలు 2024 జరిగాయి. ఆ తర్వాత పోలింగ్‌ రోజున సాయంత్రం నుంచి ఏపీ వ్యాప్తంగా అల్లర్లు కూడా జరిగిన విషయం తెలిసిందే. బ్యాలట్లు సైతం ధ్వంసం చేశారు. ఈ ఘటనపై ఎన్నికల కమిషన్ తీవ్రంగా మండిపడింది. అయితే, సదరు ఎన్నికల ఫలితాలు జూన్‌ 4న వెల్లడవుతాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి ఘటనలు జరగకుండా ముందస్తుగా ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మూడు రోజుల పాటు వరుసగా మద్యం విక్రయాలు బంద్. మండే ఎండలకు ఇది మందుబాబులకు బ్యాడ్‌ న్యూస్‌. ఇప్పటికే వైన్‌ షాపుల్లో బీర్లు లేక విలవిల్లాడుతున్న మందుబాబులకు ఇది మరో షాకింగ్‌ విషయం.


ఇదీ చదవండి: ఏపీ ఈఏపీసెట్ 2024 ఫలితాలు ఎప్పుడు, ఎలా చెక్ చేసుకోవాలి


ఈ తేదీల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏపీ హోటల్స్‌, లాడ్జీలలో తనిఖీ కూడా చేయనున్నారు. అనుమానితులు కూడా అదుపులోకి తీసుకోనున్నారు. ఎన్నికల ఫలితాల సమయంలో మద్యం పంపిణీ అడ్డుకోవడానికి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఈ చర్యలు తీసుకున్నారు. అంతేకాదు సోషల్‌ మీడియాలో కూడా వచ్చే వార్తలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అప్రత్తంగా ఉండాలని చెప్పారు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )


ఇదీ చదవండి: ముంచుకొస్తున్న ఫలితాల సమయం.. జగన్‌, చంద్రబాబు, పవన్‌ ఏపీకి చేరుకునేదెప్పుడంటే..?
 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter