AP EAPCET 2024 Results: ఏపీ ఈఏపీసెట్ 2024 ఫలితాలు ఎప్పుడు, ఎలా చెక్ చేసుకోవాలి

AP EAPCET 2024 Results: ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ లేదా ఈఏపీసెట్ 2024 ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. ఈఏపీసెట్ ఫలితాలతో పాటు కౌన్సిలింగ్ షెడ్యూల్ కూడా ప్రకటించనుంది ఉన్నత విద్యామండలి. ఫలితాలు ఎప్పుడు విడుదల కానున్నాయి, ఎలా చెక్ చెసుకోవాలనే వివరాలు తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 29, 2024, 07:10 AM IST
AP EAPCET 2024 Results: ఏపీ ఈఏపీసెట్ 2024 ఫలితాలు ఎప్పుడు, ఎలా చెక్ చేసుకోవాలి

AP EAPCET 2024 Results: ఏపీలోని ఇంజనీరింగ్, అగ్రికల్చరల్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఏపీ ఈఏపీసెట్ 2024 పరీక్షలు ఇప్పటికే పూర్తయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల 39 వేల మంది రాసిన ఈ పరీక్షల ఫలితాలు జూన్ మొదటి వారంలో విడుదల కానున్నాయి. cets.apsche.ap.gov.in.ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. 

ఏపీలో అగ్రికల్చరల్, ఫార్మసీ కళాశాలల ప్రవేశానికి సంబంధించిన పరీక్షలు మే 16, 17 తేదీల్లో జరగగా ఇంజనీరింగ్ విభాగపు పరీక్షలు మే 18 నుంచి 23 వరకూ జరిగాయి. తెలంగాణలో హైదరాబాద్ సహా ఏపీలో మొత్తం 142 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు పూర్తయ్యాయి. మొత్తం 3 లక్షల 62 వేల 851 మంది దరఖాస్తు చేసుకోగా 3,39,139 మంది హాజరయ్యారు. అంటే 93.47 శాతం పరీక్షలకు హాజరయ్యారు. ఇంజనీరింగ్ విభాగంలో అత్యధికంగా 2,58,373 మంది పరీక్షలు రాశారు. ఇక బైపీసీ విభాగంలో 80,766 మంది పరీక్షలకు హాజరయ్యారు. 

ఏపీ ఈఏపీసెట్ 2024 లేదా ఏపీ ఎంసెట్ 2024 పరీక్షల ప్రిలిమినరీ కీను మే 23వ తేదీన కాకినాడ జేఎన్టీయూ విడుదల చేయగా మే 26 వరకూ కీపై అభ్యంతరాలు స్వీకరించారు. ఏపీఈఏపీసెట్ 2024లో ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజ్ ఉంటుంది. జూన్ మొదటి వారంలో ఫలితాలు విడుదల కాగానే అధికారిక వెబ్‌సైట్ cets.apsche.ap.gov.in.ద్వారా చెక్ చేసుకోవచ్చు. కేవలం హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు ఎంటర్ చేస్తే చాలు ఫలితాలు స్క్రీన్‌పై ఉంటాయి. ఏపీ ఈఏపీసెట్ 2024 ఫలితాల విడుదలతో పాటు కౌన్సెలింగ్ షెడ్యూల్ కూడా విడుదల కానుంది. ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చరల్ విభాగాల్లో ఏ తేదీన ఏయే ర్యాంకులకు కౌన్సెలింగ్ అనేది తేలనుంది. 

Also read: New Rules from June: జూన్ నుంచి ఈ అంశాల్లో భారీ మార్పులు, మీ బడ్జెట్‌పై ప్రభావం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News