ప్రపంచాన్ని భయపెడుతున్న కొత్త రకం కరోనా వైరస్ ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశించిందా..యూకే నుంచి ఢిల్లీ కొచ్చి..అక్కడ్నించి తప్పించుకున్న ఆ మహిళ రాజమండ్రి చేరడమే దీనికి కారణంగా తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


కరోనా కొత్త వైరస్ ( New coronavirus ) ఇప్పుడొక సమస్యగా మారింది. బ్రిటన్ ( Britain ) నుంచి ప్రారంభమై వివిధ దేశాలకు విస్తరిస్తున్న నేపధ్యంలో బ్రిటన్‌కు విమాన రాకపోకల్ని ఇండియా నిషేధించింది. అప్పటివరకూ ఇండియాకు చేరుకున్నవారికి ఆర్టీపీసీఆర్ పరీక్ష ( RTPCR Test ) చేసి..పాజిటివ్ అయితే కోవిడ్ సెంటర్‌కు..నెగెటివ్ అయితే క్వారెంటైన్‌కు తరలిస్తున్నారు. ఈ క్రమంలో యూకే నుంచి ఢిల్లీకు చేరిన ఓ మహిళను ఎయిర్ పోర్టు అధికారులు క్వారెంటైన్‌లో ఉంచారు. 


అయితే ఆ మహిళ ఢిల్లీ క్వారెంటైన్ ( Delhi Quarantine )నుంచి  తప్పించుకుని ఏపీ ఎక్స్‌ప్రెస్ ద్వారా రాజమండ్రికి చేరింది. ఈ విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే అప్రమత్తమై ఆమెను పట్టుకున్నారు. రెండు ఐసోలేషన్ గదుల్ని ఏర్పాటు చేసి..ఆమెను..ఆమె కుమారుడిని ఐసోలేషన్ లో ఉంచారు. ఇంతకీ ఈ మహిళకు సోకింది పాత కరోనా వైరస్‌నాా లేదా..కొత్త కరోనా వైరస్‌నా అనేది ఇంకా తేలాల్సి ఉంది. తదుపరి పరీక్షల కోసం శాంపిల్‌ను పూణేకు పంపించారు. 


కొత్త రకం కరోనా వైరస్ యూకే ( UK )ను వణికిస్తున్న నేపధ్యంలో అక్కడి భారతీయులు ఇండియాకు పయనమవుతున్నారు. దాంతో అధికారులు అప్రమత్తమై పరీక్షలు నిర్వహించి కోవిడ్ సెంటర్ లేదా క్వారెంటైన్‌కు తరలిస్తున్నారు. ఈనెల 22న యూకే నుంచి నాలుగు విమానాల్లో ఢిల్లీకు చేరుకున్నవారిని పరీక్షించగా 11 మందికి పాజిటివ్‌గా తేలింది. 


Also read: AP: Fee Reimbursement: ఇక ఎప్పటికప్పుడే ఫీజుల చెల్లింపు