విజయవాడ: కుటుంబకలహాలు భరించలేని ఓ మహిళ ఆత్మహత్య చేసుకుందామని కృష్ణానదిలో దూకిన ఘటన బుధవారం విజయవాడలో చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన ఓ మహిళ, తన రెండేళ్ల కొడుకుతో సహా ఇంట్లోంచి వచ్చేసి ప్రకాశం బ్యారేజీ వద్దకు చేరుకుంది. అనంతరం తన కుమారుడిని అక్కడే వదిలేసి నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే, అదృష్టవశాత్తుగా అక్కడే ఉన్న గజ ఈతగాళ్లు మహిళ నదిలో దూకడాన్ని గమనించి వెంటనే ఆమెను రక్షించి ఒడ్డుకు తీసుకొచ్చారు. అనంతరం ఆ మహిళను పోలీసులు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా... ఆమెకు ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. బ్యారేజీపై ఉన్న సీసీటీవీ కెమెరాల్లో మహిళ ఆత్మహత్యాయత్నం దృశ్యాలు రికార్డయ్యాయి. కుటుంబ కలహాల నేపథ్యంలోనే సదరు మహిళ ఆత్మహత్యకు యత్నించినట్లు తెలుస్తోంది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బాధితురాలి కుటుంబసభ్యులను పిలిపించిన పోలీసులు.. వారికి కౌన్సిలింగ్ నిర్వహించి మహిళను వారికి అప్పగించారు.