కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో పౌరులు లాక్ డౌన్ ఆంక్షలు ఉల్లంఘించకుండా చూసేందుకు అహర్నిశలు కృషి చేస్తోన్న పోలీసుల కష్టాన్ని చూసి ఓ మహిళ చలించిపోయారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా నలుగురి కోసం పాటుపడుతున్న పోలీసులకు తన వంతుగా ఏదైనా సహాయం చేయాలని భావించిన ఆ సాధారణ మహిళ.. వారి కోసమని కూల్ డ్రింక్స్ కొని తీసుకెళ్లి ఇచ్చారు. పాయకరావుపేటకు చెందిన లోకమణి అనే ఈ మహిళ గొప్ప మనసు పోలీసులను ఆనందంలో, ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఓ ప్రైవేటు స్కూల్లో రూ.3500ల వేతనానికి ఆయాగా పనిచేస్తోన్న లోకమణి.. అంత చిన్న జీతంలోంచే తమకు కూల్ డ్రింక్స్ కొనిస్తున్నారని తెలిసిన తర్వాత ఆమె గొప్ప మనసు చూసి చలించిపోవడం పోలీసుల వంతయ్యింది. Also read : KTR supports employees: ఉద్యోగులను తీసేయొద్దు: మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


తమ కోసం ఏదైనా చేయాలని ముందుకొచ్చినందుకు మేమే మీకు కృతజ్ఞతలు చెప్పాలంటూ సున్నితంగానే ఆమె ఇచ్చిన కూల్ డ్రింక్స్‌ని తిరస్కరించిన పోలీసులు.. తమ వద్ద ఉన్న రెండు కూల్ డ్రింక్స్ బాటిల్స్‌ని కూడా ఆమెకే ఇచ్చి పంపించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియో చూసి ఏపీ డీజీపి గౌతం సవాంగ్ సైతం స్పందించారు. స్థానిక పోలీసుల సహాయంతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా లోకమణితో మాట్లాడిన డీజీపీ గౌతం సవాంగ్.. ఆమెకు కృతజ్ఞతలు చెప్పి సెల్యూట్ చేయడం విశేషం. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..