హైదరాబాద్: కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు కేంద్రం విధించిన లాక్డౌన్ కారణంగా దేశంలో చాలా కంపెనీలు ఆర్ధికంగా దెబ్బతిన్నాయని... తీవ్ర నష్టాలు చవిచూస్తున్నాయని పలు వాణిజ్య సంస్థలు, ఆర్థిక నిపుణులు గగ్గోలు పెడుతుండటం నిత్యం వార్తల్లో చూస్తున్నదే. ఈ ఆర్థిక మాంద్యాన్ని సాకుగా చూపిస్తూ సంస్థలు ఎక్కడ తమని ఉద్యోగంలోంచి తీసేస్తాయోననే ఆందోళన ఐటి నిపుణులతో పాటు వివిధ రంగాలకు చెందిన ఉద్యోగులను వేధిస్తోంది. ఈ నేపధ్యంలోనే తెలంగాణ ఐటి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామా రావు ఐటీ సంస్థలు సహా వివిధ రంగాలకు చెందిన పరిశ్రమలకు తాజాగా ఓ లేఖ రాశారు.
On behalf of Telangana Government, Minister @KTRTRS appealed to IT and Industry heads to ensure that no employee - regular, contract or outsourced, lose their job during this crisis. pic.twitter.com/N4E8iDVEpm
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) April 18, 2020
కరోనావైరస్ విజృంభిస్తోన్న ఈ కష్టకాలంలో రాష్ట్ర ప్రజలను ఆదుకోవడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో సర్కార్ ఎంతో కృషిచేస్తోందని.. సర్కార్‌కి ఎంతో మంది దాతలు కూడా ముందుకొచ్చి సహాయం అందిస్తున్నారని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. కరోనా ప్రభావంతో అన్ని రంగాల సంస్థలు తీవ్ర ఆర్థిక మాంద్యాన్ని, సవాళ్లను ఎదుర్కొంటున్నాయనే సంగతి తనకు తెలుసునని గుర్తుచేస్తూనే.. అదే సమయంలో సంస్థలకు ఇన్నేళ్లుగా అండగా ఉంటూ వచ్చిన సిబ్బంది పట్ల కఠినంగా వ్యవహరించకుండా మానవతా దృక్పథంతో ఉండాలని మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
Also read : వాళ్ల ఖాతాల్లో మాత్రమే డబ్బులు పడలేదు
రెగ్యులర్ ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో ఎవ్వరినీ విధుల నుంచి తొలగించకుండా వారికి అండగా నిలవాల్సిందిగా ఆయన కోరారు. సాధ్యమైనంత త్వరలోనే మనకూ మంచి రోజులు వస్తాయని.. లాక్ డౌన్ అనంతరం అన్ని రంగాలు ఆర్థికంగా పుంజుకుంటాయని ఆకాంక్షించారు. అన్నిరకాల పరిశ్రమలకు తెలంగాణ సర్కార్ కూడా అండగా నిలుస్తుందని మంత్రి కేటీఆర్ వారికి భరోసా ఇచ్చారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..