Repalle Rape case: ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా మానవ మృగాలు రెచ్చిపోతున్నాయి. నిత్యం ఎక్కడో ఒక్క చోట అఘాయిత్యాలు చోటుచేసుకుంటునే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఏపీలో తీవ్ర కలకలం రేపుతోంది. భర్తను బెదిరించి భార్యపై గ్యాంగ్‌ రేప్‌కు పాల్పడ్డారు. నిత్యం రద్దీగా ఉండే రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన జరగడంపై విమర్శలు వస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉమ్మడి గుంటూరు జిల్లాలో నిత్యం ఇలాంటి ఘటనలు జరుగుతుండటంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. వారంరోజుల వ్యవధిలో ఇది నాలుగో ఘటన. స్థానికంగా ఈ అంశం తీవ్ర కలకలం రేపుతోంది. తాజాగా బాపట్ల జిల్లాలో దారుణం జరిగింది. రేపల్లె రైల్వే స్టేషన్‌లో మహిళపై దుండగులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. భర్త ముందే ఈ దారుణానికి పాల్పడ్డారు. ముగ్గురు కలిసి అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. 


వేసవి కాలం కావడంతో ఊరులో పనులు లేకపోవడంతో వలస వెళ్లాలని భార్యాభర్తలు నిర్ణయించుకున్నారు. ఈక్రమంలో అవనిగడ్డలో పనుల కోసం బయలుదేరారు. ఐతే వారు అర్ధరాత్రి సమయంలో రేపల్లె రైల్వేస్టేషన్‌కు చేరుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆ సమయంలో అవనిగడ్డకు వెళ్లేందుకు వాహనాలు లేకపోవడంతో అక్కడే ఉండి ఉదయం వెళ్లాలనుకున్నారు.  


రైల్వేస్టేషన్‌లో ఉన్న బల్లలపై భార్యాభర్తలు నిద్రిస్తున్నారని.. ఇదే అదునుగా మహిళపై నిందితులు కన్నేసినట్లు విచారణలో తేలింది. బల్లపై నిద్రిస్తున్న మహిళను పక్కకు లాకెళ్లి..అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. వారికి అడ్డుకున్న భర్తపై దాడికి దిగారు. ఈ ఘటనలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. జరిగిన దారుణాన్ని పోలీసుల ముందు చెప్పి వాపోయారు. రంగంలోకి దిగిన పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. బాధితుల నుంచి వివరాలు సేకరించారు. భార్యాభర్తలు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంకు చెందిన వారిగా గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.


రైల్వేస్టేషన్‌లో సీసీ ఫుటేజీ ఆధారంగా ముగ్గురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రేపల్లె పీఎస్‌లో వారిని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. బాపట్ల ఎస్పీ వకూల్ జిందాల్ స్వయంగా రంగంలోకి దిగారు. త్వరలో కేసు చేధిస్తామని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం సైతం సీరియస్ అయ్యింది. నిందితులు ఎవరైనా కఠిన చర్యలు తప్పవని హోంమంత్రి వనిత స్పష్టం చేశారు. 


మరోవైపు ఏపీ ప్రభుత్వం తీరుపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. జగన్ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శిస్తున్నాయి. ప్రభుత్వ వైఫల్యం వల్లే నిత్యం ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఫైర్ అవుతున్నాయి. తక్షణమే నిందితులను పట్టుకుని..బాధితులకు ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇటు రైల్వే స్టేషన్‌లో భద్రత వైఫల్యంపై రైల్వే అధికారులు విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. 


Also read: Nurse Body Hanging: నర్సుగా చేరిన మరుసటిరోజే... నర్సింగ్ హోమ్ గోడకు శవమై వేలాడిన యువతి...


Also read: Acharya: 'చిరు', 'చిరుతకు' కూడా దక్కని అభిమానం.. రియల్ హీరోకి పూజలు, మామూలుగా లేదుగా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook