Nurse Body Hanging: నర్సుగా చేరిన మరుసటిరోజే... నర్సింగ్ హోమ్ గోడకు శవమై వేలాడిన యువతి...

Nurse Body Hanging: నర్సింగ్ హోమ్‌లో నర్సుగా చేరిన మరుసటిరోజే ఓ నర్సు శవమై కనిపించింది. ఆమె మృతదేహం నర్సింగ్ హోమ్ గోడకు వేలాడుతూ కనిపించడంతో స్థానికంగా కలకలం రేగింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 1, 2022, 12:59 PM IST
  • యూపీలో దారుణ ఘటన
  • నర్సింగ్ హోమ్‌లో శవమై గోడకు వేలాడిన నర్సు
  • ఆసుపత్రిలో చేరిన మరుసటిరోజే ఈ ఘటన
Nurse Body Hanging: నర్సుగా చేరిన మరుసటిరోజే... నర్సింగ్ హోమ్ గోడకు శవమై వేలాడిన యువతి...

Nurse Body Hanging: ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ నర్సింగ్ హోమ్ గోడకు నర్సు మృతదేహం వేలాడుతూ కనిపించడం తీవ్ర కలకలం రేపింది. ఆసుపత్రిలో చేరిన మరుసటిరోజే ఆ నర్సు ఇలా శవమై కనిపించడంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. నర్సింగ్ హోమ్ నిర్వాహకులే ఆమెపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసి ఉంటారని ఆరోపించారు. 

ఉన్నావ్ జిల్లాలోని బంగర్‌మౌ ప్రాంతంలో ఈ నెల 25న న్యూ నవ జీవన్ నర్సింగ్ హోమ్‌ను ప్రారంభించారు. అదే జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన 18 ఏళ్ల యువతి ఈ నెల 29న ఆ నర్సింగ్ హోమ్‌లో నర్సుగా చేరింది.

కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆమె ఆసుపత్రిలో నర్సుగా చేరినరోజు పెద్దగా పేషెంట్స్ ఎవరూ లేరు. దీంతో కాసేపటికి ఆమె ఇంటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో ఆసుపత్రి యాజమాన్యం ఆమెకు ఫోన్ చేసి నైట్ డ్యూటీ చేయాల్సిందిగా కోరింది. దీంతో ఆ నర్సు నైట్ డ్యూటీకి వెళ్లింది. ఏమైందో ఏమో తెలియదు కానీ మరుసటిరోజు ఉదయం ఆమె మృతదేహం నర్సింగ్ హోమ్ గోడకు వేలాడుతూ కనిపించింది.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టమ్ నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె మృతి చెందిన సమయంలో ముఖానికి మాస్కు, చేతిలో చిన్న గుడ్డ ముక్క ఉన్నట్లు గుర్తించారు. ఆసుపత్రి నిర్వాహకులే ఆమెపై అత్యాచారం చేసి హత్యకు పాల్పడ్డారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీంతో ఆసుపత్రి నిర్వాహకుడితో సహా మరో ముగ్గురిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. 

Also Read: Video: ఆసియా ఛాంపియన్‌షిప్‌లో అంపైర్‌తో పీవీ సింధు వాగ్వాదం... అసహనానికి లోనైన షట్లర్...   

Also Read: Acharya: 'చిరు', 'చిరుతకు' కూడా దక్కని అభిమానం.. రియల్ హీరోకి పూజలు, మామూలుగా లేదుగా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News