AP to Receive Award from Central: మలేరియా నిర్మూలనకు ఏపీ సర్కార్ తీసుకుంటున్న చర్యలను కేంద్రం అభినందించింది. రాష్ట్ర ప్రభుత్వ చర్యలను మెచ్చి పురస్కారం ప్రకటించింది. నేడు ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా ఏపీ ప్రభుత్వానికి పురస్కారం అందజేయనుంది. ఢిల్లీలో ఇవాళ జరిగే కార్యక్రమంలో ప్రభుత్వానికి పురస్కారం అందించనుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలో 2018లో 6040 మలేరియా కేసులు నమోదవగా... 2021 నాటికి ఆ సంఖ్య 1,139కి తగ్గింది. వైసీపీ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. 2021లో మొత్తం 75,29,994 మందికి మలేరియా టెస్టులు చేయగా... అందులో 1,139 మందికి మలేరియా సోకినట్లు తేలింది. మలేరియా సోకేందుకు అవకాశం ఉన్న ప్రదేశాలను గుర్తించిన ప్రభుత్వం... ఆయా ప్రదేశాల్లో 21.50 లక్షల దోమ తెరలు పంపిణీ చేసింది.


అలాగే, దోమల నిర్మూలనకు ఇండోర్ రెసిడ్యుయల్ స్ప్రేయింగ్‌ను చేపట్టింది. ఫ్రైడే డ్రైడే పేరిట అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో దోమల కట్టడి, మలేరియాను నిరోధించేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఆరోగ్య పరిరక్షణ యాప్‌ను తీసుకొచ్చింది. దోమల నివారణ కోసం 24 లక్షల గంబూజియా చేపలను మత్స్యకారులకు పంపిణీ చేసింది. ప్రభుత్వ చర్యలతో ఈ ఏడాది ఇప్పటివరకూ కేవలం 117 మలేరియా కేసులు మాత్రమే నమోదయ్యాయి. 


కేటగిరీ-1లోకి తెలంగాణ :


అటు తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా మలేరియా నివారణ చర్యలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అభినందించింది. ప్రభుత్వ కృషిని గుర్తించి తెలంగాణను కేటగిరీ 2 నుంచి కేటగిరీ 1లో చేర్చింది. ఆరేళ్లలో తెలంగాణ ప్రభుత్వం మలేరియా నివారణకు చేపట్టిన చర్యలకు గాను ఇవాళ ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో సత్కరించనుంది. ఈ విషయాన్ని మంత్రి హరీశ్ రావు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.



Also Read: Horoscope Today April 25 2022: రాశి ఫలాలు.. ఆ రాశి వారి కష్టానికి తగిన ఫలితం దక్కే రోజు ఇది...


Also Read: PK KCR Meeting: సీఎం కేసీఆర్‌కు పీకే కీలక సూచన... వచ్చే ఎన్నికల్లో ఆ సిట్టింగ్‌లను మార్చాల్సిందే..!


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.