లగడపాటి సర్వే ఫలితాలపై రోజా రియాక్షన్
ఎన్నికల ఫలితాలపై వైసీపీ మహిళా నేత రోజా తనదైన శైలిలో స్పందించారు
మరో 24 గంటల్లో ఎన్నికల ఫలితాలు వెలువడతున్నాయి..దీంతో ఎక్కడ చూసినా ఎవరు అధికారంలోకి వస్తారనేదే చర్చ. ఏపీలో ప్రధానంగా రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వస్తారనే దారిపై జనాలు ఫోకస్ చేస్తున్నారు. ఎగ్జిట్ ఫోల్ ఫలితాలు కూడా ఎటూ తేల్చక పోవడంతో ఈ ఫలితాలపై మరింత ఉత్కంఠత నెలకొంది. జగన్ అధికారం చేపడతారని కొందరు అంటుంటే.. మరి కొందరేమే మళ్లీ చంద్రబాబుదే అధికారమని వాదిస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్ర ఆక్టోపస్ గా పేరున్న లగడపాటి తన సర్వే మళ్లీ టీడీపీదే అధికారమని పేర్కొన్నారు.
అవి గదిలో కూర్చోని వేసిన లెక్కలు ...
ఈ నేపథ్యంలో లగడపాటి రాజగోపాల్ సర్వేపై రోజా తనదైన శైలిలో స్పందించారు. ఓ గదిలో కూర్చుని అంకెలేసుకున్నమాత్రానా అవి నిజమౌతాయా అంటూ రోజా ఎద్దేవ చేశారు. లగడపాటి రాజగోపాల్ జనాలకు మాయమాటలు చెబుతున్నారని విమర్శించారు. ఇలాంటి సర్వేలను జనాలు నమ్మే పరిస్థితి లేదన్నారు.ఈ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను గుర్తు చేశారు.
కన్ఫామ్ ...ఈ సారి సీఎం జగనే
కన్ఫామ్ గా చెబుతున్నా.. కావాలంటే రాసిపెట్టుకొండి ఈ సారి జగన్ సీఎం అవుతారని కాన్ఫిడెంట్ గా పేర్కొన్నారు. ఈ విషయంలో ఏ మాత్రం సందేహం లేదన్నారు. సీట్ల విషయంపై స్పందిస్తూ 120 నుంచి 130 ఎమ్మెల్యే సీట్లు.. 22-23 ఎంపీ సీట్లు గెలవబోతున్నామన్నారు. మరో 24 గంటల్లో ఈ నిజం ప్రపంచానికి తెలుస్తుందని అన్నారు. ఈ రోజు ఉదయం తిరుమలకు వచ్చిన రోజా ఈ వ్యాఖ్యలు చేశారు.