కశ్మీర్:  పుల్వామా ఉగ్రవాదుల చర్యలను భారతీయులందరూ ముక్త కంఠంతో ఖండిస్తుంటే... చంద్రబాబు మాత్రం సమర్ధిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు.  ఈ రోజు తిరుమలలో శ్రీనివారిని దర్శించుకున్న రోజా...మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ పుల్వామాలో 40 మంది భారత సైన్యాన్ని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదుల చర్యలను మనం అందరం వ్యతిరేకిస్తున్నాం.. కానీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం సమర్ధిస్తున్నారు..ఇలాంటి నీచమైన చర్యలను కూడా ఆయన రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారని మండిమడ్డారు. 


ఉగ్రవాద చర్యలకు నైతిక బాధ్యత వహించి ప్రధాని మోడీ రాజీనామా చేయాలని చెప్పడం చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. గోదావరి పుష్కరాల సమయంలో 30 మంది అమాయకులన ప్రాణాలను పొట్టనపెట్టుకున్న చంద్రబాబు ఎందుకు రాజీనామా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు..తనకొక నీతి ..ఇతరులకు మరోక నీతి అన్నట్లుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని రోజా విమర్శించారు