ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో  నెంబర్ 1 గా తీర్చిదిద్దుతానని ఏపీ సీఎం చంద్రబాబు పదే పదే చెబుతున్న విషయం తెలిసిందే. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రతిపక్ష పార్టీ వైసీపీ మరోలా స్పందించింది. వివరాల్లోకి వెళ్లినట్లయితే.. ప్రతిపక్ష పార్టీ మహిళా నేత రోజా స్పందిస్తూ రాష్ట్రాన్ని నెంబర్ వన్ గా తీర్చుతానన్న చంద్రబాబు లక్ష్యం నెరవేరిందని.. మన రాష్ట్రం ఏ రంగంలో నెంబర్ వన్ సాధించిందో  తెలియదు కానీ.. ఎయిడ్స్ వ్యాధి, మహిళ అక్రమ రవాణా విషయంలో నెంబర్ వన్ స్థాయిని అందుకుందని రోజా ఎద్దేవ చేశారు. అలాగే  ప్రపంచంలోనే అత్యంత అవినీతి ముఖ్యమంత్రి చంద్రబాబు అని రిపోర్టులు చెబుతున్నాయని ఆరోపించారు.  ఆస్తుల ప్రకటన అంటూ చంద్రబాబు దొంగ ప్రకటనలు చేస్తున్నారని ఆమె విమర్శించారు. ఈ విషయాన్ని తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్టు చేశారు.. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో  హల్ చల్ చేస్తోంది.