వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ అయిన కర్నూలు ఎంపీ బుట్టారేణుకను అఖిలపక్ష సమావేశానికి పిలవడంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫార్టీ ఫిరాయించిన ఆమెను ఎలా పిలుస్తారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంతకుమార్ ను విజయసాయిరెడ్డి నిలదీశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం ఆమెపై అనర్హత పిటిషన్ ఇంకా పెండింగ్ లో ఉందని.. తమ పార్టీ నుంచి అనుమతి లేఖ లేకుండానే ఆమెను పిలవడం సరైన పద్దతి కాదన్నారు.  బీజేపీ-టీడీపీ పార్టీలు కలిసే ఈ పనిచేశాయని.. ఈ రెండు పార్టీలు కుమ్మక్కయ్యానడానికి ఈ ఘటనే నిదర్శనమని విజయసాయిరెడ్డి ఆరోపించారు.


రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి వైసీపీ రెబల్ ఎంపీ బుట్టారేణును పిలవడం గమనార్హం. కాగా ఇదే అంశంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇలా మండిపడ్డారు.